సింగపూర్‌లో మంత్రి నారా లోకేష్‌కు ఘన స్వాగతం
సింగపూర్: ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సింగపూర్ పర్యటనకు చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి ప్రవాసాంధ్రులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పలువురు తెలుగు సంఘాల ప్రతినిధులు, ఐటీ రంగ నిపుణులు, వ్యాపారవేత్తలు లోకేష్‌ను కలిసి రాష్ట్ర అభివృద్ధిపై అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ప్రవాసాంధ్రులు, రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థను ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడంలో మంత్రి లోకేష్ కీలక పాత్ర పోషించారని పేర్కొంటూ ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడుల వాతావరణం మెరుగుపడుతోందని, కొత్త పరిశ్రమలు రావడం వల్ల యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు.
అనంతరం ప్రవాసాంధ్రులతో మాట్లాడిన మంత్రి నారా లోకేష్, విదేశాల్లో పనిచేస్తున్న తెలుగువారు రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించాలని కోరారు. మీరు పనిచేస్తున్న సంస్థల్లో ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అభివృద్ధి, ప్రభుత్వం తీసుకొస్తున్న పారిశ్రామిక పెట్టుబడుల గురించి తెలియజేయాలని సూచించారు. ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
సింగపూర్ పర్యటనలో భాగంగా పలువురు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో మంత్రి లోకేష్ సమావేశం కానున్నట్లు సమాచారం.