లేటెస్ట్

‘చంద్రబాబు’ అరెస్టు…!?

టిడిపి అధినేత చంద్రబాబునాయుడును సిఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయనను శుక్రవారం రాత్రి నుండి అరెస్టు చేయడానికి ఏపీ సీఐడీ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. రాయలసీమ పర్యటనలో ఉన్న చంద్రబాబును చిత్తూరు జిల్లా అంగళ్లు దాడి ఘటనలో అరెస్టు చేయడానికి పోలీసులు యత్నిస్తున్నారు. అంగళ్లు ఘటనలో టిడిపి అధినేత చంద్రబాబును ఏ1గా పోలీసులు పేర్కొంటున్నారు. ఆయనను ఈ కేసులో అరెస్టు చేయడానికి పోలీసులు గత కొంతకాలంగా వేచి చూస్తున్నారు. ఇటీవల కాలంలో చంద్రబాబు ఐటీ కేసులో అరెస్టు చేస్తారని ప్రచారం జరిగింది. అయితే ఆ కేసులో అరెస్టు చేయడానికి ఎటువంటి ప్రాధమిక ఆధారాలు లేనందున ఇప్పుడు అంగళ్లు కేసులో అరెస్టు చేస్తున్నారు. ఇదే కాకుండా స్కిల్‌డెవలప్‌మెంట్‌ కేసులో కూడా అరెస్టు చేయాలని ప్రభుత్వం భావించినా అంగళ్లు కేసులోనే అరెస్టును ఎంచుకున్నారని తెలుస్తోంది. తనను అరెస్టు చేస్తారని చంద్రబాబు రెండు రోజుల క్రితమే చెప్పారు. ప్రభుత్వం అక్రమంగా తనను అరెస్టు చేయబోతోందని, జగన్‌ ప్రభుత్వం ప్రజలపై దాడులకు దిగుతోందని, తనను కూడా వదలకుండా వేధిస్తోందని ఆయన ఆరోపించారు. గత కొంత కాలంలో ఏదో ఒక కేసులో చంద్రబాబును అరెస్టు చేయాలని ప్రభుత్వం కుట్ర చేస్తూ వస్తోంది.


ఏదో విధంగా ఆయనను అరెస్టు చేసి జైలుకు పంపించాలని భావిస్తూ, ఇప్పుడు శుక్రవారాన్ని టార్గెట్‌గా పెట్టుకుంది. శుక్రవారం నాడు అరెస్టు చేస్తే బెయిల్‌కు అవకాశం ఉండదని, అందుకే ఇప్పుడు అంగళ్లు కేసుతో పనిపూర్తి చేసుకోవాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంగళ్లు కేసులో చంద్రబాబును ఏ1గా చూపించారు. ఈ కేసులో ఆయనపై హత్యాయత్నంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో అరెస్టు చేస్తే వెంటనే బెయిల్‌ రాదనే ఉద్దేశ్యంతో దీనిని ఎంచుకున్నారని ప్రచారం జరుగుతోంది.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ