టిడిపికి 15 ఎంపి సీట్లుః ఇండియాటుడే సర్వే
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీకి 15 ఎంపి సీట్లు వస్తాయని ప్రముఖ ఆంగ్లపత్రిక ఇండియాటుడే తెలియజేసింది. మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియాటుడే ప్రతి ఆరు నెలలకు ఒకసారి సర్వే నిర్వహిస్తుంది. ఈసర్వే ప్రకారం కేంద్రంలో మరోసారి బిజెపి అధికారంలోకి వస్తుందని తేలింది. అయితే అందరూ ఆసక్తిగా చూస్తోన్న ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మరోసారి అధికారంలోకి రావడానికి అవకాశం ఉందని తేలింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టిడిపికి 15పైగా ఎంపీ స్థానాలు వస్తాయని తేల్చింది. ఇదే సంస్థ గతంలో నిర్వహించిన సర్వేలో టిడిపికి పది స్థానాలు ఇచ్చింది. అయితే గత ఆరు నెలల నుంచి టిడిపి పరిస్థితి బాగా మారిందని, ఆ పార్టీ పట్ల ప్రజలు విశేషంగా ఆకర్షితులవుతున్నారని తేల్చింది. టిడిపి ఒంటరిగానే అధికారం దిశగా పయనిస్తోందని సర్వే తేల్చింది. అయితే జనసేన,టిడిపి కలిసి పోటీ చేస్తే అధికార వైకాపా అడ్రస్సు గల్లంతు అవడం ఖాయని తేలిపోయింది. గత వారం టైమ్స్‌నౌ అనే ఆంగ్ల ఛానెల్ అధికార వైకాపాకు మొత్తం 25 పార్లమెంట్ సీట్లు వస్తాయని ప్రకటించింది. అయితే ఆ సర్వే ప్రజలు పెద్దగా విశ్వసించలేదు. చివరకు అధికారపార్టీ కూడా దీన్ని నమ్మలేదు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం అన్ని వర్గాల నమ్మకాన్ని వేగంగా కోల్పోయింది. ప్రతిపక్షాలపై దాడులు, ప్రశ్నించేవారిని వేధింపులకు గురిచేస్తూ అడ్డగోలుగా అధికారాన్ని చెలాయిస్తోంది.
సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, ఇవే తమకు అధికారాన్ని మరోసారి అందిస్తోందన్న ధీమాతో రెచ్చిపోయి ప్రజలపై హింసకు దిగుతోంది. నాలుగున్నరేళ్ల నుంచి అధికార పార్టీ ఆగడాలకు విసుగెత్తిపోయిన ప్రజలు ఇప్పుడిప్పుడు ప్రశ్నించడం, నిలదీయడంతో అధికారపార్టీ అసలు రంగు బయటపడుతోంది. మొత్తం మీద అరాచకపాలనకు ఆంధ్రాజనం త్వరలోనే చరమగీతం పాడుతారని సర్వే ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.