బిజెపి ఆధ్వర్యంలో స్వీట్లు పంపిణీ

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

వినుకొండ : భారత్ ప్రధాని నరేంద్ర మోడీ నమ్మకమే నేడు జరిగిన ఎన్నికల్లో బిజెపి పార్టీ విజయ టంక మోగించిందని ఆ పార్టీ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి కట్టా సుబ్బారావు తెలిపారు. స్థానిక కొత్తపేటలోని బిజెపి కార్యాలయం నందు మంగళవారం ఎన్నికల్లో బిజెపి విజయ డంక మోగించిన సందర్భంగా కట్టా

సుబ్బారావు ఆధ్వర్యంలో విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత పట్నంలో బిజెపి కార్యకర్తలతో కలిసి విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో బిజెపి కైవసం చేసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోడీపై ఉన్న నమ్మకంతోనే ఎన్నికల్లో విజయం సాధించినట్లు

తెలిపారు. బిజెపి ప్రవేశపెట్టిన మహిళా బిల్లును కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించినందుకే ఇప్పుడు జరిగిన ఎన్నికల గెలుపుకు నిదర్శనం అన్నారు. అనంతరం కార్యాలయం ఎదుట బాణాసంచా పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శివాజీ వెంకయ్య, అద్దంకి సుధాకర్, ఎండ్లూరు వీరయ్య, అచ్యుత మూర్తి, లాయర్ అప్పారావు, గుడిపాటి చంద్రం తదితరులు పాల్గొన్నారు.