లేటెస్ట్

‘నేనూ ఆత్మహత్య చేసుకుందామనుకున్నా..!

బాలీవుడ్‌ హీరో ‘సుశాంత్‌’ ఆత్మహత్య ప్రకంపనలు ఇంకా ఆగలేదు. ఎంతో ఉజ్వల‌ భవిష్యత్‌ ఉన్న ‘సుశాంత్‌’ ఆకస్మికంగా మృతి చెందడం వెనుక ఒత్తిడి ఉందని, ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారని, ఇది ‘సుశాంత్‌’ ఒక్కడి విషయంలో కాదని, తాను ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందామని ఆలోచన చేశానని, కానీ తన స్నేహితులు ఎప్పుడూ తనతో ఉండడం, కన్నురెప్ప ఆర్పకుండా తనతో ఉండి కాపాడుకున్నారని ప్రముఖ బాలీవుడ్‌ నటుడు ‘మనోజ్‌బాయి’ తెలిపారు. ఇటీవల‌ బాలీవుడ్‌లో తన ప్రయాణం గురించి హ్యూమన్స్‌ ఆఫ్‌ బొంబాయితో ఆయన మాట్లాడారు. వెనుక బడిన బీహార్‌ నుంచి బొంబాయి వరకు తన ప్రయాణం గురించి, సినిమా అవకాశాల‌ కోసం పడిన కష్టాల‌ గురించి, ఒక రైతు కుమారుడిగా ఎదుర్కొన్న కష్టాల‌ గురించి ఆయన చెప్పుకున్నారు. 

తాను రైతు కొడుకును. బీహార్‌లోని ఒక గ్రామంలో పెరిగాను. ఐదు మంది తోబుట్టువుల‌తో మేము ఒక గుడిసె వంటి పాఠశాల‌కు వెళ్లాము. సరళమైన జీవితాన్ని గడిపాము, కానీ మేము నగరానికి వెళ్లినప్పుడల్లా థియేటర్‌కు వెళ్తాము. అమితాబ్‌ అభిమానిని, అతన వలే ఉండాల‌ని కల‌లు కన్నాను. తొమ్మిదేళ్ల వయస్సులో ఆ కల‌లు నెరవేరవని తెలుసు. అయినప్పటికీ మరేదానిపై దృష్టి పెట్టకుండా బొంబాయికి వచ్చేశాను. ఈ సంగతి నా కుటుంబానికి తెలియదు. అక్కడ థియేటర్‌ కోర్సు చదివాను..చివరగా నాన్నకు ఒక లేఖ రాశాను. ఆయన నేను చేసిన పనికి కోపపడాతరని భావించాను..కానీ నాకు రూ.200/- లు పంపారు. ఇంటికి తిరిగి రావడానికి మనస్సు అంగీకరించలేదు. బీహార్‌ నుంచి వచ్చిన నాకు ఇంగ్లీషు, హిందీ రాదు. ఎన్‌ఎస్‌డి కోసం మూడు సార్లు ధరఖాస్తు చేసుకున్నాను. కానీ మూడుసార్లు తిరస్కరించబడింది. ఈ సమయంలో నేను ఆత్మహత్యకు దగ్గరగా ఉన్నాను. కానీ నా స్నేహితులు నా పక్కన నిద్రపోయారు..నన్ను ఒంటరిగా ఒదలిపెట్టలేదు..చివరి వరకు ప్రయత్నించమని  వారు నన్ను కోరారు. చివరకు ఎన్నో ప్రయత్నాల‌ తరువాత నా శ్రమ ఫలించింది.   హిందీ చిత్ర పరిశ్రమలో అత్యంత గౌరవనీయమైన మరియు ప్రియమైన నటుల్లో మనోజ్‌ ఒకరు. రామ్‌గాపాల్‌వర్మ యొక్క ‘సత్య’ సినిమా ఆయనకు ప్రజాదరణ తెచ్చిపెట్టింది. ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ చనచిత్ర పురస్కారాన్ని మరియు ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్‌ క్రిటిక్స్‌ అవార్డును అందుకున్నారు.

(178)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ