చంద్రబాబు సర్కారు రైతులను గాలికొదిలేసింది.. మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి: కారుమూరి సునీల్ కుమార్

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో మొక్కజొన్న రైతుల సమస్యలు రోజురోజుకు తీవ్రరూపం దాలుస్తున్నాయని వైఎస్ఆర్సీపీ ఏలూరు పార్లమెంట్ ఇంచార్జ్ కారుమూరి సునీల్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఉదయం రైతులను పరామర్శించిన ఆయన, చంద్రబాబు ప్రభుత్వం రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు.

ఎన్నికల సమయంలో రైతులకు అనేక హామీలు ఇచ్చిన ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సంక్షేమాన్ని గాలికొదిలేసిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా మొక్కజొన్న రైతులు ఎకరాకు రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టి పంట సాగు చేసినప్పటికీ, ప్రస్తుతం మద్దతు ధర కూడా అందక నష్టాల్లో కూరుకుపోయారని అన్నారు.

రైతుల కష్టాన్ని ప్రభుత్వం గుర్తించి వెంటనే గిట్టుబాటు ధర ప్రకటించాలని, కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. రైతుల జీవితాలతో రాజకీయాలు చేయకుండా వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు రావాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాధం, స్థానిక పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు