'అవినీతి పప్పులు ఉడకలేదని తప్పుడు ఆరోపణలు..."
రొంపిచర్ల మండల టీడీపీ నేతల అవినీతితో ప్రభుత్వానికి చెడ్డపేరు.. సాగర్ కాలువలో వైసీపీ కోవర్ట్ నేతల భారీ అవినీతి వ్యవహారానికి నిజాయితీ కలిగిన అధికారిణి అడ్డుగా మారిందన్న కారణంగానే సాగునీటి సంఘం అధ్యక్షుల ముసుగులో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. సిమెంట్ లైనింగ్ నిర్మాణం చేసిన అద్దంకి బ్రాంచి కాలువలో 11 కి.మీ నుంచి 15 కి.మీ వరకు భారీగా పూడిక మట్టి చేరిందని తప్పుడు అంచనాలను వేయించారు. టీడీపీ రొంపిచర్ల శాఖ అధ్యక్షుడు పల్లెల నాగిరెడ్డి, సాగునీటి సంఘం అధ్యక్షులు ఘంటా హనుమా ప్రసాద్ తదితరుల
అవినీతి ప్రణాళిక మేరకు రూ.90 లక్షల నిధులను సైతం మంజూరు చేయించారు. లేని పనులు చేసినట్లు రాజకీయ సిఫార్సులతో ఆ నిధుల స్వాహాకు ఎం.బుక్ రూపొందించారు. ఈ భారీ అవినీతిని వ్యతిరేకించిన డీ.ఈ విజయలక్ష్మీ సంతకం చేయకపోవడంతో అక్రమార్కులు ఆగ్రహించారు.ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చిన దొంగల ముఠా టీడీపీ రొంపిచర్ల నేతల అవినీతి పనులపై సీఎంవో ఆదేశంతో జలవనరుల శాఖ విచారణ చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. నిధుల స్వాహా చేసేందుకు తప్పుడు అంచనాలు సృష్టించడం వాస్తవమని నిర్థారణ కావడంతో ఈ నేతల కల చెందిరింది.
దీన్ని జీర్ణించుకోలేని అక్రమార్కులు తప్పుడు ఆరోపణలతో మళ్లీ కట్టుకథ అల్లారు. మంత్రి నిమ్మల రామానాయుడు, ఆయన వ్యక్తిగత సహాయకుడికి కూడా ఇప్పుడు మసిపూస్తున్నారు. కలెక్టర్ కి తప్పుడు ఫిర్యాదు చేసిన అవినీతి ముఠా వైసీపీ అనుకూల మీడియా ముందు కాకి అరుపులు అరచినంత మాత్రాన వీరి అవినీతి ఆట సాగదు. ఎమ్మెల్యే అరవింద బాబు, మంత్రి నిమ్మల రామానాయుడుతో పాటు ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొస్తున్నారని, ఈ రొంపిచర్ల దొంగల ముఠాను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నరసరావుపేట నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు