వేలాది దీపాలతో దేదీప్యమానమైన పలమనేరు
భక్తిశ్రద్ధలతో శ్రీ మహాలక్ష్మీ దీప పూజ
దీపం ఇంటికే కాదు.. సమాజానికీ వెలుగునిస్తుంది: టీటీడీ జేఈవో శరత్
ఘనంగా నిర్వహించడం ఆనందంగా ఉంది: ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి
పలమనేరు, ఆగస్టు 14 :పలమనేరు పట్టణంలోని ఎస్వీసీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో శుక్రవారం సాయంత్రం శ్రీ మహాలక్ష్మీ దీప పూజ కార్యక్రమాన్ని టీటీడీ, ఎస్వీబీసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలమనేరు, పరిసర ప్రాంతాల నుంచి వేలాది మంది మహిళలు తరలివచ్చి భక్తిశ్రద్ధలతో దీప పూజలో పాల్గొన్నారు. వేలాది దీపాల కాంతులతో కళాశాల ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో దేదీప్యమానంగా మారింది.

📌 ఇవి కూడా చదవండి
తొలి ఏకాదశి ఎందుకు అంత ప్రత్యేకం?
📌 ఇవి కూడా చదవండి
ఆషాఢ అమావాస్య నేడు.. పితృదేవతల ఆశీస్సులు పొందాలంటే ఈ పూజలు చేయండి
ఈ సందర్భంగా టీటీడీ జేఈవో డా. ఏ. శరత్ మాట్లాడుతూ దీపం ఇంటికే కాకుండా సమాజానికీ వెలుగునిస్తుందని అన్నారు. శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి అనుగ్రహంతో ప్రతి కుటుంబం సుఖసంతోషాలు, సిరిసంపదలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తిభావాన్ని, సనాతన ధర్మంపై విశ్వాసాన్ని మరింత పెంచుతాయని పేర్కొన్నారు.ఎమ్మెల్యే ఎన్. అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ పలమనేరులో శ్రీ మహాలక్ష్మీ దీపోత్సవాన్ని ఇంత ఘనంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. వేలాది మంది మహిళలు భక్తిశ్రద్ధలతో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అభినందనలు తెలిపారు. అమ్మవారి కృపతో పలమనేరు ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
📌 మరింత చదవండి
యోగిని ఏకాదశి 2026: జూలై 10నా.. 11నా? అసలు తేదీ ఇదే!
📌 మరింత చదవండి
జ్యేష్ఠ పౌర్ణమి రేపే.. ఈ 5 రాశులకు అదృష్టం, 3 రాశులు జాగ్రత్త!
ఆగమశాస్త్రోక్తంగా పూజలు
కార్యక్రమంలో అర్చకులు విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, శ్రీనివాసార్చన తదితర కార్యక్రమాలను ఆగమశాస్త్ర ప్రకారం నిర్వహించారు. అనంతరం శ్రీ మహాలక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మహిళా భక్తులతో దీప పూజ చేయించారు. వేద మంత్రోచ్చారణలు, లక్ష్మీ స్తోత్ర పారాయణాలతో ప్రాంగణమంతా భక్తిమయంగా మారింది.శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి అనుగ్రహంతో ప్రతి ఇంటా సుఖశాంతులు, సౌభాగ్యం, ఆరోగ్యం, ఐశ్వర్యం వెల్లివిరియాలని భక్తులు ప్రార్థించారు. కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేసింది.ఈ కార్యక్రమంలో ఎస్వీబీసీ ఛైర్మన్ శ్రీధర్ వర్మ, డిపిపి కార్యదర్శి డా. మేడసాని మోహన్, టీటీడీ అధికారులు, అర్చకులు, సిబ్బంది, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
ఆధ్యాత్మికం
తొలి ఏకాదశి ఎందుకు అంత ప్రత్యేకం?
📅 24 Jul 2026
ఆధ్యాత్మికం
ఆషాఢ అమావాస్య నేడు.. పితృదేవతల ఆశీస్సులు పొందాలంటే ఈ పూజలు చేయండి
📅 14 Jul 2026
ఆధ్యాత్మికం
యోగిని ఏకాదశి 2026: జూలై 10నా.. 11నా? అసలు తేదీ ఇదే!
📅 09 Jul 2026
ఆధ్యాత్మికం
జ్యేష్ఠ పౌర్ణమి రేపే.. ఈ 5 రాశులకు అదృష్టం, 3 రాశులు జాగ్రత్త!
📅 28 Jun 2026