ఏపీఈఆర్సీ చైర్మన్‌గా బినోయ్ కుమార్ నియామకం
అమరావతి, నవంబర్ 3: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) చైర్మన్‌గా విశ్రాంత ఐఏఎస్ అధికారి బినోయ్ కుమార్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఇంధన శాఖ మంగళవారం జీవో ఎంఎస్ నంబర్ 87ను జారీ చేసింది.
విద్యుత్ చట్టం-2003లోని సెక్షన్ 82(5), ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్కరణల చట్టం-1998లోని నిబంధనల ప్రకారం ప్రభుత్వం ఈ నియామకాన్ని చేపట్టింది. ఎంపిక కమిటీ సిఫార్సుల మేరకు బినోయ్ కుమార్‌ను ఏపీఈఆర్సీ చైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఆయన పదవీకాలం బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి ఐదేళ్లపాటు ఉంటుంది. అయితే 70 ఏళ్ల వయస్సు పూర్తయితే అంతకంటే ముందుగానే పదవీకాలం ముగుస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
📌 మరింత చదవండి
స్థానిక ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు: వైఎస్ జగన్
📌 మరింత చదవండి
నవంబరు 1న మున్సిపల్ ఎన్నికలు!
ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఎనర్జీ) కె. విజయానంద్ ఈ ఉత్తర్వులను జారీ చేశారు.