నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్.. విజయవాడలో భారీ జాబ్ డ్రైవ్
విజయవాడలో నిరుద్యోగ యువతకు భారీ ఉద్యోగావకాశాలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన విజయవాడలో ప్రత్యేక జాబ్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్. శ్రీనివాసరావు తెలిపారు. ఈ జాబ్ మేళా ద్వారా 350కు పైగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు.
ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు
ఈ జాబ్ డ్రైవ్‌లో ప్రముఖ అంతర్జాతీయ సంస్థ Safran Electrical & Power India మరియు Premier Energies Limited సంస్థల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ (GET), ప్రొడక్షన్ అసోసియేట్, హెల్పర్స్ వంటి పోస్టులకు నియామకాలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
ఎవరెవరు అర్హులు..?
10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, B.Tech మరియు పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులని పేర్కొన్నారు. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన యువతీ యువకులు ఈ జాబ్ డ్రైవ్‌లో పాల్గొనవచ్చని తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.14,500 నుంచి రూ.25,000 వరకు వేతనం అందించనున్నట్లు వెల్లడించారు.
ఉచిత భోజనం, రవాణా సౌకర్యం
ఉద్యోగాల్లో ఎంపికైన వారికి ఈఎస్ఐ, పీఎఫ్, గ్రాట్యుటీ, అటెండెన్స్ బోనస్‌తో పాటు ఉచిత భోజనం మరియు రవాణా సౌకర్యం కూడా కల్పించనున్నట్లు తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్‌లో విధులు నిర్వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
ఎక్కడ.. ఎప్పుడు హాజరుకావాలి..?
ఈ నెల 20వ తేదీ బుధవారం ఉదయం 9 గంటలకు విజయవాడలోని జిల్లా ఉపాధి కార్యాలయం, ప్రభుత్వ ఐటీఐ కాలేజీ ప్రాంగణం, రమేష్ హాస్పిటల్స్ రోడ్ వద్ద నిర్వహించే జాబ్ డ్రైవ్‌కు అభ్యర్థులు హాజరుకావాలని కోరారు.
ముందస్తు రిజిస్ట్రేషన్ తప్పనిసరి
ఆసక్తి గల అభ్యర్థులు ముందుగా APSSDC Registration Portal వెబ్సైట్లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం 93917 52833 నంబర్‌ను సంప్రదించాలని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్. శ్రీనివాసరావు తెలిపారు.