సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులకు శుభవార్త

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

పలమనేరు, ఆగస్టు 8:సంతానలేమి సమస్యతో బాధపడుతున్న దంపతులకు నిపుణుల వైద్య సలహాలు, చికిత్సా విధానాలపై అవగాహన కల్పించేందుకు పలమనేరులో ఉచిత సంతాన సాఫల్య వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు షిఫా వి కేర్ ఫెర్టిలిటీ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ ఖలీలుల్లా తెలిపారు. వి కేర్ ఐవీఎఫ్ సెంటర్ ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 9న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ శిబిరం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.శిబిరానికి హాజరయ్యే దంపతులకు నిపుణులైన వైద్యులు అవసరమైన పరీక్షలు

నిర్వహించి, సంతానలేమికి గల కారణాలు, అందుబాటులో ఉన్న చికిత్సా విధానాలపై తగిన సూచనలు ఇవ్వనున్నారు. ఐవీఎఫ్, ఐయూఐ, ఐసీఎస్‌ఐ, ఐఎంఎస్‌ఐ వంటి ఆధునిక సంతానోత్పత్తి వైద్య విధానాలపై కూడా అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.డాక్టర్ అంజు మున్నీసా మాట్లాడుతూ సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులు ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రస్తుత ఆధునిక వైద్య సాంకేతికతతో సంతానలేమి సమస్యకు వివిధ రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. చికిత్స ఖర్చులను సులభతరం చేసేందుకు వాయిదాల పద్ధతిలో చెల్లించే ఈఎంఐ సదుపాయం కూడా

కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.డాక్టర్ ఖలీలుల్లా మాట్లాడుతూ సాధారణంగా రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు అయ్యే ఐవీఎఫ్ చికిత్సను వార్షికోత్సవ ప్రత్యేక ఆఫర్‌లో భాగంగా రూ.1.20 లక్షలకే అందించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సంతానలేమితో బాధపడుతున్న దంపతులు వినియోగించుకోవాలని సూచించారు.పలమనేరు ఎంబీటీ రోడ్డులోని షిఫా వి కేర్ ఫెర్టిలిటీ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో ఈ శిబిరం నిర్వహించనున్నారు. ఆసక్తి ఉన్న దంపతులు ముందస్తుగా నమోదు చేసుకుని శిబిరానికి హాజరై వైద్య నిపుణుల సలహాలు పొందాలని ఆస్పత్రి యాజమాన్యం కోరింది.