హనుమాన్ జయంతి వేడుకలు.. ఏలూరులో భారీ బైక్ ర్యాలీ
ఏలూరు, మే 12, 2026: హనుమాన్ జయంతి సందర్భంగా ఏలూరులో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో భారీ హనుమాన్ శోభాయాత్ర బైక్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. రామకోటి ప్రాంగణం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీకి యువత, భక్తులు భారీ సంఖ్యలో హాజరై నగరంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు.
ఈ బైక్ ర్యాలీని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గారపాటి సీతారామాంజనేయ చౌదరి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ యువతలో సేవాభావం, దేశభక్తి, ధర్మ రక్షణ భావనలు పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.
గారపాటి చౌదరి మాట్లాడుతూ హనుమంతుడి స్ఫూర్తితో సమాజ సేవలో యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. భక్తులు క్రమశిక్షణతో పాల్గొనడం అభినందనీయమన్నారు.
రామకోటి ప్రాంగణం నుంచి ప్రారంభమైన శోభాయాత్ర మెయిన్ బజార్, పాత బస్టాండ్, ఫైర్ స్టేషన్, విజయవిహార్ సెంటర్, పత్తేబాడ, డీ-మార్ట్, 12 పంపుల సెంటర్ మీదుగా ఆదివారపు పేటలోని అభయాంజనేయ స్వామి విగ్రహం వరకు సాగింది.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నారా శేషు, బీజేపీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్, కృష్ణ ప్రసాద్, విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు, వివిధ హిందూ సంస్థల సభ్యులు మరియు భారీ సంఖ్యలో యువత పాల్గొన్నారు.