జగన్ దగ్గర హీరో.. ఇప్పుడు కూటమిలోనూ కీలకం.. ఈ ఐఏఎస్ ఎవరు?
టిడిపి హయాంలో వేల కోట్ల ప్రాజెక్టులు.. ఆరోపణలు వచ్చినా కదలని అధికారి
ఆయనో సీనియర్ ఐఏఎస్. గతంలో టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కీలకమైన శాఖను నిర్వహించారు. అప్పట్లో టిడిపి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్దిలో భాగంగా కీలకమైన ప్రాజెక్టులను చేపట్టింది. అయితే..ఈ ప్రాజెక్టుల నిర్వహణ అంతా ఆయనే చూశారు. వేల కోట్లు ఆయన చేతుల మీదుగా ఖర్చు అయ్యేవి. ఇష్టారాజ్యంగా కాంట్రాక్టుల టెండర్ల రేట్లు పెంచేసి..అటు కాంట్రాక్టు సంస్థలకు, ఇటు ఈ సంస్థలకు సదరు ఐఏఎస్ బాగా దోచిపెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. 2014-19 మధ్య కాలంలో ఆయన గారు ఆడిందే ...ఆట పాడిందే..పాట. చంద్రబాబు ప్రభుత్వం ఆయనపై ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చినా..ఆయనను ఇసుమంత కూడా కదిలించలేదు.
జగన్ హయాంలోనూ అదే జోరు.. కీలక పోస్టులు, కోట్ల నగదు ప్రచారం
తరువాత చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయి...జగన్ ప్రభుత్వం వచ్చింది. అయితే జగన్ అధికారం చేపట్టిన తరువాత కక్ష సాధింపు చర్యల్లో భాగంగా టిడిపి హయాంలో పనిచేసిన కొందరు ఐఏఎస్లను ఇష్టారాజ్యంగా వేధింపులకు గురిచేసింది. కొందరికి పోస్టింగ్లు ఇవ్వకుండా, మరి కొందరికి పోస్టింగ్లు ఇచ్చినా..నామ మాత్రమైన..లేక ఎటువంటి ప్రాధాన్యత పోస్టింగ్లు ఇచ్చి...వారిని అవమానాల పాలు చేసింది. కొందరిపై కేసులు నమోదు చేయించి..అరెస్టులు కూడా చేయించింది. అయితే..ఆశ్చర్యకరంగా..మనం చెప్పుకుంటున్న ఐఏఎస్పై ఈగ కూడా వాలలేదు. పైగా జగన్ ఆయనకు అత్యంత ప్రాధాన్యత కలిగిన పోస్టులను కట్టబెట్టారు. దీంతో మనోడు మళ్లీ రెచ్చిపోయాడు. ఎంతగా రెచ్చిపోయాడంటే..ఇంట్లో ఎంత సొమ్ములు పోగుపడిపోయాయో తెలియనంతగా..దోచేశాడనే ఆరోపణలు వచ్చాయి. అంత సొమ్ము ఇంట్లో ఉంటే..అక్కడ పనిచేసేవారు ఊరుకోరు కదా..చేతికి దొరికింది దోచుకుని పరార్ అయ్యారు.
జగన్ను ఆకాశానికెత్తిన అధికారి.. కూటమి హయాంలోనూ అదే హవా
దీనిపై అప్పట్లో బహిరంగానే వార్తలు వచ్చాయి. కోట్ల సొమ్ములు పనివాళ్లు కొట్టేశారని, దీంతో సదరు ఐఏఎస్ లబోదిబో మన్నారని అప్పట్లో గుప్పుమంది. అయితే..అప్పుడు అధికారంలో ఉన్న జగన్మోహన్రెడ్డి ఇదంతా పట్టించుకోలేదు. తనకు ఏమి దక్కుతుందో చూసుకున్నారు కానీ..తన అధికారులు ఏమి కొట్టేస్తున్నారో..చూసుకోలేదు..అవసరం కూడా లేదనుకున్నారు. ఆయన ఐదేళ్ల కాలం..మనోడి హవా మామూలుగా సాగలేదు. అందినకాడికి దోచుకుని గప్చుప్ అన్నట్లు వ్యవహరించాడు. అంతేనా..జగన్ను వీరుడు...శూరుడు..అంటూ..ఆయనను ఆకాశానికెత్తేశాడు. దీంతో..జగన్ మరింతగా మనోడిని ప్రోత్సహించాడు.
కూటమిలోనూ కీలక పాత్ర.. “ఇలాంటి లక్ అందరికీ రాదు” అంటున్న ఐఏఎస్ వర్గాలు
ఇదంతా..గతమైతే..ఇప్పుడు సదరు ఐఏఎస్ వ్యవహారం గతానికన్నా బ్రహ్మాండంగా ఉందట. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వారి వద్దకీలక శాఖ కొట్టేశారు. గత రెండేళ్ల నుంచి సదరు ఐఏఎస్ మరింతగా రెచ్చిపోయి..వసూళ్లు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడూ ఆయన హవా తగ్గలేదనే మాట సర్వత్రా వినిపిస్తోంది. కీలకమైన నేత వద్ద పనిచేస్తుండడంతో..ఆయన వ్యవహారాలు మరింతగా ముదిరాయని, ఆయన మరింతగా రాటు దేలిపోయాడనే వార్తలు ఐఏఏస్ వర్గాల్లో, సచివాలయ వర్గాల్లో హాల్చల్ చేస్తున్నాయి. మొత్తం మీద..సదరు ఐఏఎస్దే లక్కని..ఇటువంటి లక్ ఎవరూ దక్కదని ఐఏఎస్ వర్గాలు అంటున్నాయి. ఆయన జగన్ను మెప్పించారు..ఇప్పుడు కూటమి కీలకనేతలనూ మెప్పిస్తున్నారు. ఇది అందరి వల్ల అయ్యేపని కాదని, ఆయనొక్కరితోనే అవుతుందని చెవులు కొరుక్కుంటున్నారు.