నాగేశ్వర్ వ్యాఖ్యలు.. ఆంధ్రా vs తెలంగాణగా మారుతోందా..?
తెలంగాణకు చెందిన రాజకీయ విశ్లేషకుడు, ప్రొఫెసర్ నాగేశ్వర్ వివాదం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదంగా రూపాంతరం చెందుతుందా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దగ్గరకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెళ్లి..మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని అరెస్టు చేయమని అడిగారని, దానికి ఆయన జగన్ మనకు శాశ్విత మిత్రుడు, చంద్రబాబు తాత్కాలిక మిత్రుడు..జగన్‌ను అరెస్టు చేసేది లేదని, మీరు కూడా ఆయనతో సన్నిహితంగా ఉండాలని చెప్పారని, ఈ విషయం తనకు జనసేన కోర్ కమిటీ సభ్యుడు చెప్పారని ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యానించారు. దీనిపై ఒక్కసారిగా రాజకీయ దుమారం రేగింది. ఈ వ్యాఖ్యలపై ఒకవైపు టిడిపి, మరోవైపు జనసేన ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై తీవ్రంగా స్పందించాయి. ముఖ్యంగా టిడిపి తన అధికారిక సోషల్ మీడియా ఎకౌంట్లో ప్రొఫెసర్ నాగేశ్వర్ వైకాపాకు అమ్ముడుపోయారని, ఆయన వైకాపాకు మద్దతు ఇస్తున్నారని ట్రోల్ చేయగా, జనసేన కార్యకర్తలు ఆయన చేసిన వ్యాఖ్యలపై పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేసింది. ఒక్కసారిగా తనపై జనసేన, టిడిపి నుంచి దాడి జరుగుతుండడంతో..తాను చేసిన వ్యాఖ్యలు తప్పేనని, తనకు తప్పుడు సమాచారం వచ్చిందని, తాను చేసిన వ్యాఖ్యలను భేషరతుగా వెనక్కు తీసుకుంటున్నానని ఆయన ప్రకటించారు. అయితే..అక్కడ నుంచే..అసలు వివాదం మొదలైంది. ఆయన తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్న తరువాత వివాదం మరింత ముదిరింది. ఇప్పుడు ఈ వివాదాన్ని మరింతంగా రెచ్చగొట్టేందుకు ఆయనకు మద్దతుగా బిజెపి నేతలు, కమ్యూనిస్టులు, పరోక్షంగా వైకాపా నేతలు, వైకాపాను సమర్థించే తెలంగాణ
జర్నలిస్టులు తెలంగాణలో రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్వహించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై జనసేన, టిడిపి చేస్తోన్న దాడి తెలంగాణపై చేస్తోన్న దాడిగా వారు చిత్రీకరిస్తున్నారు. ఒక విశ్లేషకుడు చేసిన వ్యాఖ్యలు ఆయన భావప్రకటనా స్వేచ్ఛ అని..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావప్రకటనా స్వేచ్చను హరిస్తుందని, పైగా తెలంగాణపై ఇది దాడి అంటూ వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతేనా..ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లను తెలంగాణలో తిరగనీయమని, వారిపై రాళ్ల దాడి చేస్తామని బెదిరించారు. అసభ్యకరమై వ్యాఖ్యలు చేస్తూ..మూడు పెళ్లిళ్లూ..ఐదు పెళ్లిళ్లూ అంటూ..శీలం లేని వ్యక్తులు, చదువులేని వాళ్లు అంటూ.. ఆంధ్రా ప్రాంతం వారు తెలంగాణను దోపిడీ చేస్తున్నారి, తెలంగాణ వచ్చిన తరువాత కూడా వీరి దోపిడీకి అంతు లేకుండా పోతుందని, వీరిని తరిమికొట్టాలంటూ పిలుపులిస్తున్నారు. తెలంగాణకు చెందిన కమ్మ సామాజికవర్గం ఇంకా ఇక్కడ పెత్తనం చేస్తోందని, జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ల్లో ఉన్న వారి ఆస్తులను స్వాధీనం చేసుకోవాలంటూ...వారిని ఇక్కడ నుంచి తరిమేస్తామని హెచ్చరిస్తున్నారు. అసలు జరిగిన సంగతేమిటి..? వీళ్లు చేస్తోన్న వాదనలు ఏమిటి..? ఒక విశ్లేషకుడు ఒక విషయాన్ని సమగ్రంగా తెలుసుకోకుండా..తనకు ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేస్తే..దానికి ప్రతిస్పందించడం తెలంగాణపై దాడి అవుతుందా? ఆయన ఒక పార్టీకి భుజం కాస్తే..ఆయనను అందరూ సమర్థించాలా..? అయిన దానికి కాని దానికి ఆంధ్రాపై వీడియోలు చేస్తూ..ఆంధ్రా ప్రజల వ్యూస్‌తో బతుకుతోన్న వ్యక్తి...చేస్తోన్న వ్యాఖ్యలపై ఆ మాత్రమైనా స్పందించడానికి ఆంధ్రా వాళ్లకు అధికారం లేదా..? తెలంగాణకు చెందిన వ్యక్తి, ఇక్కడ సామాన్యుల అభిప్రాయాలను పట్టించుకోకుండా ఏది నోటికి వస్తే..దాన్ని
వాగి..ఇప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ, తెలంగాణపై దాడి అంటే..ఊరుకోవాలా..? అనే ప్రశ్నలు ఆంధ్రా సమాజం నుంచి వ్యక్తం అవుతున్నాయి. దాడి చేసేది వారే..మళ్లీ తెలంగాణ వాదాన్ని అడ్డుపెట్టుకునేది వారే..? ఇదే వ్యాఖ్యలు...కెసిఆర్ గురించో..రేవంత్‌రెడ్డి గురించో..ఆంధ్రా జర్నలిస్టులు చేస్తే..తెలంగాణ వాళ్లు ఊరుకుంటారా..? ఒక కేంద్ర హోంమంత్రిని, ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ..ఒక పార్టీకి కొమ్ము కాస్తుంటే..చూస్తూ ఊరుకోవాలా..? తెలంగాణలో ఆంధ్రా వాళ్లు ఆస్తులు సంపాదించుకుంటే, లేక వ్యాపారాలు చేసుకుంటే..దానిపై దాడులు చేస్తామని ఉన్నతస్థాయిలో..అది జర్నలిస్టులమని చెప్పుకునే మంద హెచ్చరిస్తుంటే..అసలు భారత దేశంలో ప్రజాస్వామ్యం ఉందా..? అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతున్నాయి. ఒక ఆర్థిక నేరస్థుడిని అడ్డగోలుగా వెనుకోసుకొస్తున్న ఈ తెలంగాణ మేధావులకు ఇతరులను ప్రశ్నించే హక్కు ఉందా..? వీళ్లు కూడా నీతులు చెబుతారా..? అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. నిజాయితీపరులను సమర్థిస్తే..ఎవరూ అభ్యంతరం చెప్పరు. కానీ..లక్షల కోట్ల అవినీతి, అక్రమాలు, హత్యలుచేసిన వారికి కొమ్ము కాయడంపైనే...ఆంధ్రా వాళ్ల అభ్యంతరం. అడ్డమైన వ్యాఖ్యలు చేయడం..తరువాత తీరిగ్గా..తెలంగాణపై దాడి అంటూ..ముసుగేసుకోవడం కొంత మంది తెలంగాణ మేధావులకు అలవాటైంది. వాళ్లు చేసిన తప్పుల నుంచి తప్పించుకోవడానికి ఆంధ్రా, తెలంగాణ మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం కూడా పరిపాటైంది. ఇప్పుడు ప్రొఫెసర్ వివాదం కూడా ఆంధ్రా, తెలంగాణ మధ్య వివాదంగా మార్చాలనే ధ్యేయంతో వీరు పనిచేస్తున్నారు. ఇటువంటి అరాచకశక్తులను ఆదిలోనే తుంచేయాలి. ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన 11ఏళ్ల తరువాత కూడా తెలంగాణ పేరిట పబ్బం గడుపుకోవాలన్న వీరి పన్నాగాలకు చెక్ పెట్టాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది.