పల్నాడు జిల్లా జడ్పీ చైర్మన్ రేసులో టీడీపీ సీనియర్ నేత నందిగం
25 ఏళ్లుగా టీడీపీకి అండగా..పల్నాడు జిల్లా వ్యాప్తంగా విస్తృత పరిచయాలుపల్నాడు జిల్లా పరిషత్ (జడ్పీ) చైర్మన్ పదవికి నాదెండ్ల మండలం ఎండుగుంపాలెంకు చెందిన సీనియర్ టీడీపీ నాయకులు నందిగం శ్రీనివాసరావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. పార్టీ కోసం సుదీర్ఘకాలంగా పనిచేస్తూ, స్థానికంగా బలమైన రాజకీయ, సామాజిక సంబంధాలు కలిగిన ఆయన జడ్పీ చైర్మన్ పదవిపై ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.నందిగం కుటుంబానికి టీడీపీతో సుదీర్ఘ అనుబంధం ఉంది. పార్టీ ఆవిర్భావం నుంచి నాదెండ్ల మండలంలో టీడీపీ బలోపేతానికి వారి కుటుంబం కృషి చేస్తూ వస్తోంది. నందిగం శ్రీనివాసరావు స్వయంగా ఎండుగుంపాలెం సర్పంచ్గా, ఎంపీటీసీగా పనిచేసి గ్రామీణ స్థాయిలో ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకున్నారు.గత 25 ఏళ్లుగా చిలకలూరిపేట నియోజకవర్గంతో పాటు
నాదెండ్ల మండలంలో టీడీపీ నాయకత్వానికి వెన్నుదన్నుగా నిలుస్తూ పార్టీ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించి, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలకు అండగా నిలవడంతో పాటు అభ్యర్థుల విజయానికి తన వంతు కృషిచేశారు.చిలకలూరిపేట నియోజకవర్గంలో టీడీపీకి అండగా నిలిచిన నందిగం శ్రీనివాసరావు. 1999, 2009, 2014, 2024 సాధారణ ఎన్నికల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు గారి విజయానికి అన్ని విధాలుగా తనవంతు సహకారం అందించారు. పల్నాడు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు అందరితో నందిగంకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇప్పటికే వారిని కలిసి తన అభ్యర్థిత్వానికి మద్దతు కోరినట్లు తెలుస్తోంది.పల్నాడు జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులతో ఉన్న సత్సంబంధాలు నందిగం శ్రీనివాసరావుకు అదనపు బలంగా మారుతున్నాయి. ఆయన
అభ్యర్థిత్వానికి ఎమ్మెల్యేల నుంచి సానుకూల స్పందన లభిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.జడ్పీ చైర్మన్గా అవకాశం లభిస్తే పల్నాడు జిల్లాలో గ్రామీణ మౌలిక వసతులు, విద్య, వైద్యం, తాగునీరు, పారిశుధ్యం, యువతకు ఉపాధి అవకాశాలు, పారిశ్రామిక అభివృద్ధి వంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంటుందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నారు.దీర్ఘకాలంగా పార్టీకి అండగా నిలవడం స్థానిక ప్రజాప్రతినిధిగా పనిచేసిన అనుభవం, జిల్లాలోని రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలు వంటి అంశాలు నందిగం శ్రీనివాసరావు అభ్యర్థిత్వానికి బలంగా మారుతున్నాయని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.తెలుగుదేశం పార్టీ అధిష్టానం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నప్పటికీ, పల్నాడు జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి నందిగం శ్రీనివాసరావు పేరు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.