ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్..!

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

మాజీ ముఖ్య‌మంత్రి Y. S. Jagan Mohan Reddyను అరెస్టు చేయించాల‌ని తాను కేంద్ర హోంమంత్రి Amit Shahను అడిగిన‌ట్లు, దానికి ఆయ‌న తిర‌స్క‌రించి.. జ‌గ‌న్ లాంగ్ ట‌ర్మ్ స్నేహితుడ‌ని, చంద్ర‌బాబు షార్ట్ ట‌ర్మ్ స్నేహితుడ‌ని, చంద్ర‌బాబును న‌మ్మ‌వ‌ద్ద‌ని, జ‌గ‌న్‌తో స‌ఖ్య‌త‌గా ఉండాల‌ని అమిత్‌షా అన్నార‌ని ప్రొఫెస‌ర్ K. Nageshwar చేసిన వ్యాఖ్య‌ల‌పై జ‌న‌సేన అధ్య‌క్షుడు, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప ముఖ్య‌మంత్రి Pawan Kalyan తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆయ‌న‌దో ప‌క్క‌నే ఉండి, త‌మ సంభాష‌ణ విన్న‌ట్లు చెప్ప‌డంపై ప‌వ‌న్ తీవ్రంగా స్పందించారు. అస‌లు ఇలాంటి విశ్లేష‌ణ‌లు ఎలా చేస్తార‌ని, తానేదో ఊరుకుంటుంటే.. ప్రొఫెస‌ర్ రెచ్చిపోతున్నార‌ని, తాను చాలా బ‌లంగా నిల‌బ‌డ‌తాన‌ని, ఇప్ప‌టి వ‌ర‌కూ త‌న‌ను వాడుకుంది చాల‌ని, ఇక‌నైనా ప‌ద్ద‌తిగా ఉండాలంటూ.. ఆయ‌న ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్‌ను తీవ్రంగా హెచ్చ‌రించారు. అస‌లు ఒక హోంమంత్రిని అలా ఎందుకు అడుగుతామ‌ని, తాను రాష్ట్ర భ‌విష్య‌త్తు కోసం కృషి చేస్తుంటే.. ఇలాంటి ప‌నికిమాలిన మాట‌లు ఎలా మాట్లాడ‌తార‌ని ఆయ‌న నిల‌దీశారు. ఎవ‌రో రోడ్డున పోయేవారు ఇలా అంటే.. దానిని ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని, కానీ.. ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్ వంటి వ్య‌క్తులు ఇలా మాట్లాడ‌డం స‌రికాద‌ని, దీనిపై తాను ఊరుకోన‌ని ప‌వ‌న్ హెచ్చ‌రించారు.

ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌తో ఒక్క‌సారిగా నాగేశ్వ‌ర్ క్యాంప్‌లో అల‌జ‌డి రేగింది. అంత‌కు ముందు ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న‌ను ఏమీ అన‌ర‌ని, ఆయ‌న‌కూ త‌న‌కూ మంచి సంబంధాలు ఉన్నాయ‌ని, త‌న కొడుకు పెళ్లికి పిలిస్తే ప‌వ‌న్ వ‌చ్చార‌ని, ఆయ‌న మంచివాడ‌ని నాగేశ్వ‌ర్ కితాబు ఇచ్చారు. అయితే.. గ‌త కొన్ని రోజులుగా జ‌రుగుతోన్న ర‌చ్చ‌తో ప‌వ‌న్ ఒక్క‌సారిగా రెచ్చిపోయారు. త‌న‌ను కించ‌ప‌ర్చ‌డాన్ని ఆయ‌న స‌హించ‌లేక‌పోయారు. ఎవ‌రికో ల‌బ్ది చేకూర్చ‌డానికి త‌న పేరును నాగేశ్వ‌ర్ వాడుకున్న విధానంపై ఆయ‌న మండిప‌డుతున్నారు. త‌న‌తో పాటు కేంద్ర హోంమంత్రిని కూడా నాగేశ్వ‌ర్ కించ‌ప‌రిచాడ‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

కాగా నాగేశ్వ‌ర్ వ్యాఖ్య‌ల‌పై రోజు రోజుకూ వివాదం ముదురుతోంది. ఒక‌వైపు టీడీపీ, జ‌న‌సేన నాగేశ్వ‌ర్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తుండ‌గా, ఆశ్చ‌ర్య‌క‌రంగా బీజేపీ నుంచి ఆయ‌న‌కు మ‌ద్ద‌తు వ‌స్తోంది. బీజేపీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు Muralidhar Rao ఆయ‌న‌కు అండ‌గా నిల‌బ‌డ్డారు. నాగేశ్వ‌ర్‌పై కేసులు న‌మోదు చేయ‌డం స‌రికాద‌ని, ఆయ‌న‌పై కేసులు పెట్ట‌వ‌ద్దంటూ ఏపీ ప్ర‌భుత్వానికి సూచించారు. సాక్షాత్తూ కేంద్ర హోంమంత్రిని కించ‌ప‌రిచినా ఆయ‌న‌పై కేసులు వ‌ద్ద‌న‌డం ఏమిటంటూ.. జ‌న‌సేన‌, టీడీపీ నేత‌లు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు.

కేంద్ర పెద్ద‌లు రాజ‌కీయ వ్య‌భిచారం చేస్తున్నార‌నే విధంగా నాగేశ్వ‌ర్ వ్యాఖ్య‌లు చేశార‌ని, అయినా.. ఆయ‌న‌కే వారు మ‌ద్ద‌తు ఇవ్వ‌డంపై ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ సాగుతోంది. వాస్త‌వానికి నాగేశ్వ‌ర్ బీజేపీకి మ‌ద్ద‌తుదారుడేమీ కాదు. ఆయ‌న వామ‌ప‌క్షాల‌కు మ‌ద్ద‌తుదారు. అయితే.. ఇప్పుడు ఆయ‌న‌పై టీడీపీ, జ‌న‌సేన ద్వ‌జ‌మెత్తుతుండగా.. ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా బీజేపీ రావ‌డం వెనుక కుల రాజ‌కీయాలే కార‌ణ‌మ‌నే భావ‌న వ్య‌క్తం అవుతోంది. నాగేశ్వ‌ర్ వామ‌ప‌క్షాల‌కు మ‌ద్ద‌తు ఇచ్చినా.. బీజేపీ పెద్ద‌లు ఆయ‌న ఇంటికి వెళ్లిన సంఘ‌ట‌న‌లు గ‌తంలో ఉన్నాయి. దీనిని బ‌ట్టి ఇక్క‌డ పార్టీలు, సిద్ధాంతాలు ఏమీ లేవ‌ని, కేవ‌లం కులం కోణంలోనే ఆయ‌న‌కు బీజేపీ మ‌ద్ద‌తు ఇస్తోంద‌నే అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి.

మ‌రోవైపు ఏపీ మంత్రి Nara Lokesh చేసిన వ్యాఖ్య‌ల‌పై కూడా నాగేశ్వ‌ర్ తీవ్రంగా స్పందిస్తున్నారు. తాను గోల్డెన్ స్పూన్‌తో పుట్ట‌లేద‌ని, త‌న తండ్రి రాజ‌కీయ‌వేత్త కాద‌ని, త‌న‌ను సోకాల్డ్ జ‌ర్న‌లిస్టు అంటారా..? అంటూ.. ఆయ‌న ప‌రోక్షంగా లోకేష్‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. తాను యుద్ధాన్ని మొద‌లు పెట్టాన‌ని, దాన్ని తానే ముగిస్తాన‌ని సినిమా డైలాగ్‌లు కూడా నాగేశ్వ‌ర్ చెబుతున్నారు.

మొత్తం మీద ఆధారాలు లేని మాట‌లు మాట్లాడి, క్ష‌మాప‌ణ‌లు చెప్పి కూడా ఇప్పుడు మ‌ళ్లీ త‌న‌దే పైచేయి అంటూ నాగేశ్వ‌ర్ చేస్తోన్న అతి తీవ్ర విమ‌ర్శ‌లు వివాదానికి కార‌ణం అవుతున్నాయి. కాగా.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల‌పై విశ్లేష‌ణ పేరుతో విషం క‌క్కుతోన్న నాగేశ్వ‌ర్‌కు తెలంగాణ రాజ‌కీయ వేత్త‌ల నుంచి స‌హ‌కారం అంద‌డం విశేషం. ఆయ‌న‌పై కేసులు పెడితే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి ఇంటిని ముట్ట‌డిస్తామ‌ని బీఆర్‌ఎస్ వ‌ర్గాలు అంటున్నాయి. మ‌రోవైపు K. Kavitha కూడా ఆయ‌న‌కు మ‌ద్ద‌తు ఇస్తోంది. ఇక వైకాపాకు మ‌ద్ద‌తు ఇచ్చే జ‌ర్న‌లిస్టు సంఘాలు కూడా ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా మాట్లాడుతున్నాయి.

మొత్తం మీద‌.. నాగేశ్వ‌ర్ చేస్తోన్న విశ్లేష‌ణ‌లు, వ్యాఖ్య‌లు ఆంధ్రా స‌మాజాన్ని, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను కించ‌ప‌రిచే విధంగా ఉన్నాయ‌నే భావ‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వ్య‌క్తం అవుతోంది. ఒక ఉప ముఖ్య‌మంత్రిని కించ‌ప‌రిచే వ్యాఖ్య‌లు చేయ‌డమే కాకుండా, మ‌ళ్లీ “యుద్ధం చేస్తాను.. నేనే యుద్ధాన్ని ముగిస్తాను” అంటూ నాగేశ్వ‌ర్ చేస్తోన్న వ్యాఖ్య‌ల వెనుక రాజ‌కీయ వ‌ర్గాల‌తో పాటు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌తిప‌క్ష పార్టీ ఉంద‌నే భావ‌న రాజ‌కీయ ప‌రిశీల‌కుల్లో వ్య‌క్తం అవుతోంది.