పోరుమామిళ్ల నూతన సీఐగా సుబ్రహ్మణ్యం బాధ్యతలు

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం.. గంజాయి, పేకాట, అక్రమ మద్యంపై ఉక్కుపాదం

ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అమలు చేస్తాం.. ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి

పోరుమామిళ్ల, అక్టోబర్ 1: పోరుమామిళ్ల నూతన సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ (సీఐ)గా సుబ్రహ్మణ్యం గురువారం బాధ్యతలు స్వీకరించారు. నంద్యాల ట్రాఫిక్‌ విభాగం నుంచి బదిలీపై ఆయన పోరుమామిళ్లకు వచ్చారు.

ఈ సందర్భంగా సీఐ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. సర్కిల్‌ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. పారదర్శకమైన, ప్రజలకు అందుబాటులో ఉండే ఫ్రెండ్లీ పోలీసింగ్‌ విధానాన్ని అమలు చేసేందుకు కృషి చేస్తామన్నారు.

అతి సామాన్యుడు సైతం పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి తన సమస్యను నిర్భయంగా చెప్పుకుని న్యాయం పొందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సంఘ వ్యతిరేక శక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సర్కిల్‌ పరిధిలో గంజాయి, పేకాట, అక్రమ మద్యం వంటి కార్యకలాపాలకు ఎలాంటి చోటు ఉండకూడదని అన్నారు.

ట్రాఫిక్‌ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని సీఐ తెలిపారు. ప్రజలు పోలీసులకు, మీడియాకు సహకరించాలని కోరారు.

కాగా, నంద్యాల ట్రాఫిక్‌ నుంచి సుబ్రహ్మణ్యం పోరుమామిళ్లకు బదిలీ కాగా, ఇక్కడ పనిచేసిన సీఐ హేమసుందర్‌రావును వీఆర్‌కు అటాచ్‌ చేసినట్లు సమాచారం.