అంకినీడు అడ్వాన్స్డ్ స్ట్రోక్ సెంటర్ కు జాతీయ అవార్డు
గుంటూరు : లలితా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ అంకినీడు అడ్వాన్స్డ్ స్ట్రోక్ సెంటర్ కు న్యూఢిల్లీలో జరిగిన '3వ నేషనల్ స్ట్రోక్ కాంక్లేవ్ అండ్ అవార్డ్స్ 2026'లో వాయిస్ ఆఫ్ హెల్త్ కేర్ (VOH) నుండి ప్రతిష్టాత్మకమైన "స్ట్రోక్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నేషనల్" అవార్డును అందుకుంది. పక్షవాత (బ్రెయిన్ (స్ట్రోక్) చికిత్సలో అత్యున్నత ప్రమాణాలు, నాణ్యమైన వైద్య సేవలను అందించడంలో ఈ కేంద్రం చూపుతున్న నిరంతర కృషికి గాను ఈ గుర్తింపు లభించింది. మే-3, 2026న జరిగిన జాతీయ వేదికపై ఈ కార్యక్రమంలో డాక్టర్ వి. విజయ, డాక్టర్ రాఘవ శర్మ ఈ అవార్డును స్వీకరించారు. కేవలం జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా లలితా హాస్పిటల్ పలు అవార్డులను కైవసం చేసుకుంది. వరల్డ్
స్ట్రోక్ ఆర్గనైజేషన్ నుండి 'వరల్డ్ స్ట్రోక్ డే' కార్యకలాపాలకు గాను గోల్డ్ విన్నర్ అవార్డు, అంతేకాక అంతర్జాతీయంగా నిర్వహించే ఇంటర్నేషనల్ రెస్క్యూ రిజిస్ట్రీ ద్వారా స్ట్రోక్ చికిత్సలో ప్రతిభకు గుర్తింపుగా డైమండ్ స్టేటస్ కేటగిరీలో ఎంపిక కావడం విశేషం. లలితా పివిఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నందు ఇప్పుడు అన్ని రకాల పక్షవాతలకు అత్యాధునిక చికిత్స విధానాలు అందుబాటులో ఉన్నాయి. ఇస్కీమిక్ స్ట్రోక్ కు ఐవి (IV) థ్రోంబోలిసిస్, పెద్ద పక్షవాతలకు మెకానికల్ థ్రోంబెక్టమి, స్ట్రోక్ న్యూరో సర్జెరీ, బ్రెయిన్ అనూరిజమ్స్ కు కాయిలింగ్ అండ్ క్లిప్పింగ్, ఇంతేకాకా క్రిటికల్ కేర్ న్యూరాలజి ఐసీయూ, కోడ్ స్ట్రోక్ టీం 24 గం ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నది. ఈ కార్యక్రమంలో దేశ వ్యాప్తంగా పక్షవాత చికిత్స
వ్యవస్థలను బలోపేతం చేయడానికై వైద్యులు, పాలసీ నిర్ణేతలు, పరిశోధకులు, ప్రజారోగ్య నిపుణులు ఒక వేదిక పైకి వచ్చి పక్షవాత నివారణ, ముందస్తు గుర్తింపు నుండి అత్యవసర చికిత్సలు, పునరావాసం వరకు అన్ని దశల్లోనూ భారతదేశాన్ని 'స్ట్రోక్-రెడీ'గా మార్చడంపై న్యూ ఢిల్లీ నేషనల్ స్ట్రోక్ కాంక్లేవ్ లో చర్చించారు. ఈ సదస్సులో "భారతదేశంలో స్ట్రోక్ అక్రిడిటేషన్, స్టాండర్డైజేషన్" అనే అంశంపై డాక్టర్ పి. విజయ మాట్లాడారు. 1996లో స్థాపించబడిన అంకినీడు స్ట్రోక్ యూనిట్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొదటిది, దేశంలోనే రెండవది. నాటి నుండి నేటి వరకు సమగ్ర స్ట్రోక్ కేర్ అందించడంలో ఇది అగ్రగామిగా నిలుస్తోంది. భారతదేశంలోనే మొట్ట మొదటి అక్రిడిటెడ్ (గుర్తింపు పొందిన) అడ్వాన్స్ స్ట్రోక్ సెంటర్ గా దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది.