AP DSC 2026: ఏపీలో 2,721 టీచర్ పోస్టులు.. డీఎస్సీ నోటిఫికేషన్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రభుత్వం కీలక సమాచారం అందించింది. డీఎస్సీ–2026 ద్వారా మొత్తం 2,721 టీచర్ పోస్టుల భర్తీకి సంక్షిప్త నోటిఫికేషన్ జారీ చేసేందుకు అనుమతిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 13న జారీ చేసిన మూడు వేర్వేరు జీవోల ద్వారా ఈ నియామకాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

ఏపీ డీఎస్సీ 2026లో పోస్టుల వివరాలు

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం మొత్తం 2,721 పోస్టులను మూడు విభాగాలుగా భర్తీ చేయనున్నారు.

ఈ పోస్టులను ఆంధ్రప్రదేశ్ టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (APTRT–2026) ద్వారా భర్తీ చేయనున్నారు.

అభ్యర్థులు తెలుసుకోవాల్సిన విషయాలు

ఉద్యోగ క్యాలెండర్‌లో భాగంగా నాలుగో దశ ఉపాధ్యాయ నియామకాలకు ప్రభుత్వం గతంలో అనుమతి ఇచ్చింది. తాజాగా పాఠశాల విద్యాశాఖ సంచాలకులు సమర్పించిన ప్రతిపాదనలను పరిశీలించి డీఎస్సీ సంక్షిప్త నోటిఫికేషన్ జారీకి అనుమతించింది.

అయితే దరఖాస్తుల ప్రారంభ తేదీ, చివరి తేదీ, పరీక్ష షెడ్యూల్, విద్యార్హతలు, వయోపరిమితి వంటి వివరాలు ఈ జీవోల్లో వెల్లడించలేదు. పూర్తి నోటిఫికేషన్ విడుదలైన తర్వాతే ఈ వివరాలపై స్పష్టత రానుంది.

ఏపీ డీఎస్సీ–2026 కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌ను పరిశీలించి, పోస్టుల వారీగా అర్హతలు, ఎంపిక విధానం, పరీక్ష తేదీల వివరాలను నిర్ధారించుకోవాలి.