జగనన్న దెబ్బ…బీజేపీ అబ్బా...!

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

ఈసారి ఎలాగైనా ఏఐఏడీఎంకే ని ముందు పెట్టి తమిళనాడులో అధికారంలోకి రావాలని సర్వశక్తులు ఒడ్డిన బీజేపీ కలలకి ఎలక్షన్స్ లో జగన్ తన శిష్యుడు విజయ్ రూపంలో గండి కొట్టడమే కాకుండా, గవర్నర్ ద్వారా విజయ్ ని అడ్డుకోవాలని చూసిన బీజేపీ కి మైండ్ బ్లో అయ్యే షాక్ ఇచ్చాడు జగనన్న. ఆంధ్రాలో ఈవీఎం లతో తనని దొంగదెబ్బ కొట్టిన బీజేపీతో మంచిగా ఉంటున్నట్టు నటిస్తూనే సైలెంట్ గా స్ట్రోక్ ఇచ్చాడు.

ఈ ప్లాన్ ఇప్పటికిప్పుడు కాదు! ఆయన తమ్ముడి పెళ్లిలో చెన్నైలో విజయ్ కలిసినప్పుడే వ్యూహం రచించాడు జగనన్న. ఎక్కడా తన ప్రమేయం ఉన్నట్టు లేకుండా, ఇక్కడ గ్రౌండ్ అంతా సెట్ చేసి కరెక్ట్ గా ఎలక్షన్స్ టైం కి విదేశాలకు వెళ్ళిపోయాడు, తను కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు అన్నట్టుగా మొదటి రెండు రోజులూ కొన్ని ఫొటోలు లీక్ ఇచ్చారు.

ఎలక్షన్స్ లో తమిళనాడులోని తన సామాజికవర్గాన్ని, తన మతస్తులని విజయ్ వైపుకు నడిపించిన జగన్, ఇక అసలు సమయానికి కాంగ్రెస్ లో తన రహస్య మిత్రులతో విజయ్ కి అనుసంధానం చేసి, తమిళనాడు కాంగ్రెస్ డీఎంకే కి హ్యాండ్ ఇచ్చి విజయ్ కి సపోర్ట్ చేసేట్టు పావులు కదిపాడు.

దానికి కర్ణాటకలో జగనన్నకి సన్నిహితుడైన ఒక ప్రముఖ నాయకుడు అధిష్టానాన్ని ఒప్పించి విజయ్ కి మద్దతు ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకునేట్టు చేసారు. అలా చంద్రబాబు ప్రచారం చేసిన బీజేపీ, ఏఐఏడీఎంకే కి సైలెంట్ గా రాడ్ దించాడు జగనన్న.