చికెన్ వేస్ట్ రవాణాపై క్రోసూరు పోలీసుల దాడి ...

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

స్టేషన్ నుంచి మాయం చేసిన మాఫియాపల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరులో చికెన్ వేస్ట్ అక్రమ రవాణా చేస్తున్న వాహనంపై పోలీసులు దాడి చేశారు. సత్తెనపల్లి, అచ్చంపేట, అమరావతి, పెదకూరపాడు లోని దుకాణాల నుంచి కోళ్ల మాంసం వ్యర్ధాలను సేకరించి

ధరణికోట చేపల చెరువుకు తరలిస్తున్న వాహనాన్ని గురువారం స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కి తరలించారు.కేసు నమోదు చేయకుండానే వాహనం బయటకు తరలింపుపోలీస్ సిబ్బంది స్టేషన్ కి తరలించిన ఆ వాహనాన్ని ఎటువంటి కేసు నమోదు చేయకుండా బయటకు తరలించడంలో

మాఫియా చక్రం తిప్పింది. గంటల వ్యవధిలోనే చికెన్ వేస్ట్ వాహనాన్ని అక్కడి నుంచి మాయం చేసి చేపల చెరువుకు పంపించడంలో ఓ అధికారి కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఉన్నతాధికారులు విచారించి చర్య తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.