స్వచ్ఛ ఆంధ్ర అవార్డుకు పలమనేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

పలమనేరు, అక్టోబర్ 2 :ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర (SASA) స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు–2026లో జిల్లా స్థాయి అవార్డుకు పలమనేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎంపికైంది.ఈ సందర్భంగా ఏఎంసీ సెక్రటరీ వి. సంజీవ్ కుమార్ మాట్లాడుతూ..

అవార్డు సాధనకు సహకరించిన వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు, పాలకవర్గ సభ్యులు, సిబ్బంది, మార్కెట్ యార్డుకు వచ్చే రైతులు, వ్యాపారస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. అందరి సమష్టి సహకారంతోనే ఈ గుర్తింపు లభించిందన్నారు.మార్కెట్ కమిటీకి ఎల్లప్పుడూ సలహాలు, సూచనలు అందిస్తూ ప్రోత్సహిస్తున్న

పలమనేరు ఎమ్మెల్యే ఎన్. అమర్నాథరెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆహ్వానం మేరకు అక్టోబర్ 2న సాయంత్రం 4 గంటలకు చిత్తూరులోని జిల్లా ప్రజా పరిషత్ సమావేశ భవనంలో అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.