పుదుచ్చేరిలో మల్లాడి కృష్ణారావు మంత్రిగా ప్రమాణస్వీకారం.. వరుసగా నాలుగోసారి అవకాశం

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

పుదుచ్చేరి, బుధవారం మే 13 :- పుదుచ్చేరి 16వ శాసనసభలో యానాం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావుకు మంత్రిగా అవకాశం లభించింది. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ముఖ్యమంత్రి రంగస్వామితో పాటు మల్లాడి కృష్ణారావు నాలుగోసారి మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కేంద్ర

ప్రభుత్వం అనుమతితో రాజ్‌నివాస్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి మల్లాడి కృష్ణారావు, బిజెపి నుండి నమశ్శివాయ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా మల్లాడి కృష్ణారావు మాట్లాడుతూ.. తనకు మంత్రిగా అవకాశం కల్పించిన ప్రధానమంత్రి నరేంద్ర

మోడీ, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కైలాష్ నాధన్, ముఖ్యమంత్రి రంగస్వామి మరియు కేంద్ర హోంశాఖ అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. యానాం నియోజకవర్గ ప్రజలు, ఇతర రాష్ట్రాల్లోని తన అభిమానుల ఆశీస్సుల వల్లే ఈ గౌరవం దక్కిందని ఆయన పేర్కొన్నారు.