ఆరుగురు ఐపీఎస్ అధికారుల బదిలీ
అమరావతి, జూలై 6: ఆంధ్రప్రదేశ్లో ఆరుగురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరికి నూతన పోస్టింగ్లు కల్పిస్తూ సాధారణ పరిపాలన శాఖ సోమవారం ఆదేశాలు ఇచ్చింది. ఈ బదిలీలు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
చింతపల్లి ఏఎస్పీగా పనిచేస్తున్న నవజ్యోతి మిశ్రాను మార్కాపురం జిల్లా ఓఎస్డీ (అడ్మినిస్ట్రేషన్)గా బదిలీ చేశారు. కాకినాడ ఏఎస్పీ పాటిల్ దేవరాజ్ మనీష్ను తూర్పుగోదావరి రూరల్ అదనపు ఎస్పీ (అడ్మినిస్ట్రేషన్)గా నియమించారు.
నంద్యాల ఏఎస్పీ మండ జావలి అల్ఫోన్స్ను పోలవరం జిల్లా ఓఎస్డీ (అడ్మినిస్ట్రేషన్)గా బదిలీ చేశారు. రాజంపేట ఏఎస్పీ మననాథ్ హెగ్డేను అమరావతి ఓఎస్డీ (లా అండ్ ఆర్డర్)గా నియమించారు.
తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిని పల్నాడు జిల్లా అదనపు ఎస్పీ (అడ్మినిస్ట్రేషన్)గా బదిలీ చేశారు. జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుమితను నంద్యాల ఏఎస్పీగా నియమించారు. మండ జావలి అల్ఫోన్స్ స్థానంలో ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు.
ఐపీఎస్ అధికారుల బదిలీలు, నూతన పోస్టింగ్లకు సంబంధించి తక్షణమే అవసరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర డీజీపీని ప్రభుత్వం ఆదేశించింది. గవర్నర్ పేరుతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు.