టిడిపి రాష్ట్ర కార్యదర్శిగా తాళ్ల వెంకటేష్ యాదవ్.. గుంటూరులో నాయకుల ఘన అభినందనలు
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఇటీవల నియమితులైన తాళ్ల వెంకటేష్ యాదవ్ను పలువురు టిడిపి నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో ఆయన స్వగృహంలో శనివారం ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా టిడిపి రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి దానబోయిన సుందరరావు యాదవ్, తోట సాంబయ్య, సురేంద్ర, శ్రీరామాలయం టెంపుల్ చైర్మన్ కోటేశ్వరరావు, గుంటూరు పశ్చిమ మాజీ టిడిపి కార్పొరేటర్ ఈర్ల గురవయ్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాటన్ పరిశ్రమల నెంబర్ పి. శ్రీనివాస్, యాదవ ఎంప్లాయిస్ నాయకులు సాయి, తాడిబోయిన సంపత్ తదితరులు పాల్గొన్నారు.
నాయకులు తాళ్ల వెంకటేష్ యాదవ్కు శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ బలోపేతానికి ఆయన మరింత కృషి చేయాలని ఆకాంక్షిస్తూ, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని అభిలషించారు.
తాళ్ల వెంకటేష్ యాదవ్ మాట్లాడుతూ, తనపై పార్టీ అధిష్టానం ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు కృషి చేస్తానని తెలిపారు. కార్యకర్తలతో కలిసి పార్టీ అభివృద్ధికి శ్రమిస్తానని పేర్కొన్నారు.