జ‌గ‌న్ ద‌క్కింది పావ‌లానే...!?

07, Aug 2025

మ‌ద్యం కుంభ‌కోణంలో అస‌లైన బిగ్‌బాస్ మాజీ ముఖ్య‌మంత్రి వై.ఎస్‌.జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి అని, ఆయ‌న‌ను సిట్ అరెస్టు చేస్తుందిన సోష‌ల్ మీడియాలో జోరుగా ప్ర‌చారం సాగుతోంది. ఐదేళ్ల వైకాపా పాల‌న‌లో నాసిర‌కం మ‌ద్యం అమ్మి పేద‌ల ర‌క్త‌,మాంసాల‌ను జుర్రేశార‌ని, దీని ద్వారా వేల కోట్లు సంపాదించార‌ని కూట‌మి ప్ర‌భుత్వం నియ‌మించిన సిట్ త‌న ఛార్జిషీట్‌లో పేర్కొంది. ఈ కేసులో ఇప్ప‌టి వ‌ర‌కూ ప‌దుల సంఖ్య‌లో నిందితుల‌ను అరెస్టు చేశారు. నేడో రేపోజ‌గ‌న్ కూడా అరెస్టు అవ‌తార‌ని ప్ర‌చారం జ‌రుగుతున్నా..అది అంత సులువుకాద‌నేది అందరి మాట‌. ఆయ‌న‌కు బిజెపి పెద్ద‌ల అండ ఉంద‌ని, ఆయ‌న ఏమి చేసినా..ఆయ‌న‌ను అరెస్టు చేయ‌ర‌ని, ఆయ‌న‌ను బిజెపి పెద్ద‌లు కాపాడ‌తార‌ని ప‌లుసార్లు రుజువైంది. తాజాగా జ‌గ‌న్ బాబాయి హ‌త్య కేసులో కూడా జ‌గ‌న్‌కు ఊర‌ట ల‌భించింది. కేసులో ఇంక విచార‌ణ జ‌రిపేదేమీ లేద‌ని సీబీసీ కోర్టుకు తెల‌ప‌డంతో...ఈ కేసులో జ‌గ‌న్ పాత్ర‌పై ఇక విచార‌ణ జ‌ర‌గ‌ద‌ని తేలిపోయింది. ద‌రిమిలా..ఇక జ‌గ‌న్‌ను ఏ కేసులోనూ అరెస్టు చేయ‌ర‌నే సంకేతాలు వెళ్లిపోయాయి. కాగా..ఈ కేసులో ఇప్ప‌టి వ‌ర‌కూ దాదాపు 10మందిని సిట్ అరెస్టు చేసింది. వారికి కేసుతో ఉన్న సంబంధాల‌ను ప‌క్కా ఆధారాల‌తో బ‌య‌ట‌కు తెస్తోంది. వాళ్లు ఏ విధంగా వేల కోట్లు కొల్ల‌గొట్టారు..? ఎవ‌రెవ‌రికి ఎంతెంత ఇచ్చారు..? ఆ సొమ్ముల‌తో ఎలా ఎంజాయి చేశారు..? ఎక్క‌డెక్క‌డ ఎంతెంత దాచారో...బ‌య‌ట‌కు వ‌స్తోంది. దీనిపై వైకాపా నాయ‌కులు రోజుకో వింత స‌మాధానం చెబుతున్నారు. ముందేమో..అస‌లు కుంభ‌కోణ‌మే లేద‌ని, అంతా పార‌ద‌ర్శ‌కంగా చేశామ‌ని వాదించింది. అయితే..ఈ కేసులో ప్ర‌ధాన నిందితుడైన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి, అత‌ని అనుచ‌రుడు నాయుడుల‌ను అరెస్టు చేసిన త‌రువాత ఈ కుంభ‌కోణంలో ఏమి జ‌రిగిందో ప్ర‌జ‌లంతా వివ‌రంగా తెలుసుకుంటున్నారు. అయితే.. కేసు అటుతిరిగి..ఇటు తిరిగి జ‌గ‌న్‌కు ద‌గ్గ‌ర‌కు వ‌స్తుండ‌డంతో..ఏమి చేయాలో ఆయ‌న‌కు పాలుపోవ‌డం లేదు. త‌న‌ను తాను ర‌క్షించుకోవ‌డానికి ఆయ‌న ఎదురుదాడి చేస్తున్నారు. అయితే..ఈ ఎదురుదాడి పెద్ద‌గా ఫ‌లితాన్ని ఇవ్వ‌డం లేదు.


కాగా...మ‌ద్యం కుంభ‌కోణంలో సిట్ అరెస్టు చేసిన నిందితులు...మ‌ద్యం అక్ర‌మాల్లో వ‌చ్చిన సొమ్మును జ‌గ‌న్‌కు పెద్ద‌గా అప్ప‌చెప్ప‌లేద‌ని, కేవ‌లం పావ‌లా వంతు మాత్ర‌మే ఆయ‌న‌కు ఇచ్చి..మిగ‌తా సొమ్మంతా వాళ్లు మింగేశార‌ని వైకాపా నాయ‌కులు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి, మిధున్‌రెడ్డి, క‌సిరెడ్డి రాజ‌శేఖ‌ర్‌రెడ్డి,నాయుడు, ధ‌నుంజ‌య‌రెడ్డి, కృష్ణ‌మోహ‌న్‌రెడ్డి, మాజీ వైకాపా నాయ‌కుడు విజ‌య‌సాయిరెడ్డి త‌దిత‌ర‌లు సొమ్ములంతా మింగేసి..జ‌గ‌న్‌కు కేవ‌లం పావ‌లా మాత్ర‌మే ఇచ్చార‌ని, పేరు మాత్రం మా నాయ‌కుడిదా..?  సొమ్ములు మాత్రం వాళ్లు తీసుకుంటారా...? జ‌గ‌న్‌ను అమాయ‌కుడినిచేసి మ‌ద్యం సొమ్మును వారంతా క‌లిసి మింగేశార‌ని, జ‌గ‌న్‌కు కేవ‌లం పావ‌లా వంతు ఇచ్చార‌ని, ఇది అన్యాయ‌మ‌ని...వారు చెబుతున్నారు. మొత్తం మీద‌..మ‌ద్యం కుంభ‌కోణంలో..జ‌గ‌న్ కు వ‌చ్చింది త‌క్కువ‌...పోయింది ఎక్కువ‌న‌ట్లు ఉంద‌ని కొంద‌రు వైకాపా నేత‌లు అంటున్నారు. అయితే..జ‌గ‌న్ అంత అమాయ‌కుడు కాద‌ని, ఆయ‌న‌కు రావాల్సిన వాటా ఇవ్వ‌క‌పోతే..ఏమి జ‌రుగుతుందో అంద‌రికీ తెలుస‌ని,వారు అంత ధైర్యం చేయ‌ర‌ని, ఆయ‌న‌కు చెందాల్సిన సొమ్ము అణాపైస‌ల‌తో స‌హా వ‌సూలు చేసి ఉంటార‌ని మ‌రి కొంద‌రు అంటున్నారు. 


(2)
(0)

Comments