I&PR డైరెక్టర్‌గా విశ్వనాథన్
పలువురు ఐఏఎస్‌లకు పోస్టింగ్‌లు, బదిలీలు
రాష్ట్ర సమాచారశాఖ డైరెక్టర్‌గా కె.ఎస్.విశ్వనాథన్‌ను ప్రభుత్వం నియమించింది. గతంలో ఈ పోస్టులో పనిచేసిన హిమాన్ష్‌శుక్లాను నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేయడంతో..ఆయన స్థానంలో తాత్కాలికంగా ప్రఖర్‌జైన్‌కు బాధ్యతలు అప్పగించింది. అయితే..కీలకమైన సమాచారశాఖ డైరెక్టర్‌గా మరో యువ అధికారిని ప్రభుత్వం నియమించింది. విశాఖపట్నం మున్సిపల్ కమీషనర్‌గా పనిచేస్తోన్న కె.ఎస్.విశ్వనాధన్‌ను రాష్ట్ర సమాచారశాఖ డైరెక్టర్‌గా మరియు ఎక్స్ -అఫిషియో డిప్యూటీ సెక్రటరీగా ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం విశ్వనాధన్ నిర్వహిస్తోన్న విశాఖ మెట్రోపాలిటన్ కమీషనర్ పదవిని విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్రప్రసాద్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. విశ్వనాధన్ 2017 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. తమిళనాడుకు చెందిన ఈయన బి.టెక్ పట్టభద్రుడు. గతంలో ఆయన అనంతపురం అసిస్టెంట్ కలెక్టర్‌గానూ, నర్సాపురం సబ్ కలెక్టర్‌గానూ, తరువాత ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్‌గానూ, విశాఖపట్నం జాయింట్ కలెక్టర్‌గా తరువాత విశాఖ మున్సిపల్ కమీషనర్‌గానూ పనిచేశారు. ప్రస్తుతం మీడియాలో వస్తోన్న మార్పులతో రాష్ట్ర ప్రభుత్వం యువ ఐఏఎస్ అధికారులకు దానిపై అవగాహన ఉంటుందనే భావనతో మరోసారి యువ అధికారిని రాష్ట్ర సమాచారశాఖ కమీషనర్‌గా నియమించినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా, డిజిటల్ మీడియా యుగంలో పాతకాలపు ఐఏఎస్ అధికారులకు దానిపై అవగాహన ఉండదనే ఉద్దేశ్యంతో వెతికి వెతికి విశ్వనాథన్‌ను ప్రభుత్వం సమాచారశాఖ డైరెక్టర్‌గా నియమించినట్లుంది. కాగా మరో 31 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లను ప్రభుత్వం ఇచ్చింది.
మరికొన్ని పోస్టింగ్‌లుః-
1.కె.వి.ఎన్. చక్రధర్ బాబు, IAS (2011) – పోస్టింగ్ కోసం వేచి ఉన్న ఆయనను డైరెక్టర్, సెకండరీ హెల్త్ (హెల్త్, మెడికల్ & ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ)గా నియమించారు.
2.డా. మనజీర్ జీలానీ సామూన్, IAS (2012) – డైరెక్టర్, వ్యవసాయ శాఖగా నియమించారు. అదనంగా ఆయనకు ఏపీ స్టేట్ అగ్రో ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మరియు ఏపీ మార్క్‌ఫెడ్ సంస్థల వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ పదవుల ఫుల్ అదనపు బాధ్యతలు (FAC) అప్పగించారు.
3. పట్టణశెట్టి రవి సుబాష్, IAS (2013) – ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) సెక్రటరీగా నియమితులయ్యారు.
4. శివశంకర్ లోతేటి, IAS (2013) – ఏపీ సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSPDCL) చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.
5. ఎస్. దిల్లీ రావు, IAS (2013) – వ్యవసాయ శాఖ నుండి బదిలీ చేసి, ఆయన్ను వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్, ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్గా నియమించారు.
6. పి. రంజిత్ బాషా, IAS (2013) – డైరెక్టర్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్గా నియమించడంతో పాటు, కమీషనర్, స్కూల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (School Education Department) FACగా నియమించారు.
7. పి. అరుణ్ బాబు, IAS (2014) – వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్, అలాగే కమీషనర్, ఏపీ వీకర్ సెక్షన్స్ హౌసింగ్ ప్రోగ్రామ్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
8. ప్రవీణ్ అధిత్య సి.వి., IAS (2017) – మ్యానేజింగ్ డైరెక్టర్, ఏపీ ఎయిర్‌పోర్ట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్గా నియమించబడారు. అదనంగా ఆయన్ను వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఏపీ (INCAP) FACను అప్పగించారు.
9.ఆర్. గోవిందరావు, IAS (2018) – డైరెక్టర్, సివిల్ సప్లైస్గా బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఇతర ముఖ్య బదిలీలు:
10. బి. నవ్య, IAS (2016) – వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్, ఏపీ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్గా నియమితులయ్యారు.
11. జి. సూర్య సాయి ప్రవీంచంద్, IAS (2019) – జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, ఏపీ ట్రాన్స్‌కోగా నియమితులయ్యారు.
12. భావ్నా, IAS (2019) – జాయింట్ కలెక్టర్ & అదనపు జిల్లా మేజిస్ట్రేట్, బాపట్లగా నియమించారు.
13. సి. విష్ణు చరణ్, IAS (2019) – డిప్యూటీ సెక్రటరీ, సోషల్ వెల్ఫేర్ శాఖగా బదిలీ అయ్యారు.
14. శుభమ్ బన్సల్, IAS (2020) – డైరెక్టర్, ఇండస్ట్రీస్ శాఖగా నియమితులయ్యారు.
15. అభిషేక్ కుమార్, IAS (2020) – సీఈఓ, ఏపీ మరిటైమ్ బోర్డుగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
16. రాహుల్ మీనా, IAS (2021) – కమిషనర్, రాజమహేంద్రవరం మునిసిపల్ కార్పొరేషన్గా నియమించారు.
17. అపూర్వ భారత్, IAS (2021) – జాయింట్ కలెక్టర్, కాకినాడ జిల్లాగా నియమితులయ్యారు.
18. మంత్రిమౌర్య భారద్వాజ్, IAS (2022) – జాయింట్ కలెక్టర్, శ్రీ సత్యసాయి జిల్లాగా నియమితులయ్యారు.
19. తిరుమాని శ్రీ పూజ, IAS (2022) – జాయింట్ కలెక్టర్, అల్లూరి సీతారామరాజు జిల్లా FAC.