లంచాల అదానీఃఇరకాటంలో మంత్రులు...!?
ఈరోజు సచివాలయంలో జరిగిన మంత్రులు దుర్గేష్, టి.జి.భరత్‌లు ఓ జర్నలిస్టు నుంచి వచ్చిన ప్రశ్నకు తీవ్ర ఇరకాటంలో పడ్డారు. ఆ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు నేరుగా సమాధానం చెప్పలేక..తికమకకు గురయ్యారు. గతంలో జగన్ అధికారంలో ఉన్నప్పుడు అదానీ జగన్‌కు లంచాలు ఇచ్చారని ఆరోపించింది.. తెలుగుదేశమే కదా..ఇప్పుడు..లాంటి లంచాల అదానీతో ఎందుకు ఒప్పందాలు చేసుకుంటారని ఆ జర్నలిస్టు ప్రశ్నించారు. దీంతో..ఏమి సమాధానం ఇవ్వాలో మంత్రులిద్దరికీ తోచలేదు. డొంకతిరుగుడుగా..అప్పటి పరిస్థితి వేరు..ఇప్పటి పరిస్థితి వేరంటూ..ఏదేదో చెప్పారు. అయితే..ఈ విషయంలో ఆ జర్నలిస్టు మరింతగా ఒత్తిడికి గురిచేస్తూ..అప్పట్లో అదానీ లంచాల వ్యవహారంలో ఇప్పుడు మంత్రిగా ఉన్న పయ్యావుల కేశవ్ చేసిన ఆరోపణలను మళ్లీ ప్రస్తావించారు. దీంతో..ఏమి సమాధానం చెప్పాలో..తెలియక..మంత్రులు ఒకరి మొహం ఒకరు చూసుకుని...ఏదేదో..చెప్పుకున్నారు. అయితే..ఆ జర్నలిస్టు ఈ వ్యవహారంలో ఇంకా లోతుకు వెళ్లలేదు. అప్పట్లో అదానీ, జగన్ ప్రభుత్వం మధ్య జరిగిన ఒప్పందాలపై అప్పుడు పిఏసీ ఛైర్మన్‌గా ఉన్న పయ్యావుల కేశవ్ హైకోర్టులో కేసులు వేశారు. అంతేనా.. అదానీ లంచాల వ్యవహారం బయటకు వచ్చి..ఆయన జగన్‌కు లంచాలు ఇచ్చారని అమెరికా ఫెడరల్ సంస్థలు తేల్చినప్పుడు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయంలో..స్పందించిన వైనాన్ని ప్రస్తావించలేదు. అప్పట్లో పిపిఎ ఒప్పందాలపై జగన్ లడ్డూలా దొరికారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అదానీ లంచాలపై చంద్రబాబు..ఏమీ చేయలేక..కేంద్రంలో ఆయనకు మోడీ వద్ద ఉన్న పరిపతికి భయపడిపోయారని, ప్రజలపై భారీ ఎత్తున విద్యుత్ ఛార్జీలకు ఇదే కారణమైనా.. ఏమీ చేయలేక అటు అదానీ, ఇటు జగన్‌ను వదిలేశారనే ప్రచారం ఉంది. కాగా..నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని అదానీ కలిసిన వ్యవహారంపై కూడా సోషల్ మీడియాలో ఆసక్తికరమైన ప్రచారం సాగుతోంది. చంద్రబాబు ఎదుట అదానీ కాలుపై కాలు వేసుకుని కూర్చుంటే..చంద్రబాబు, మంత్రి లోకేష్ అదానీ వద్ద ఎంతో వినయంగా ఉన్నారని ప్రచారం సాగుతోంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చే..ఓ వ్యాపారవేత్త ముఖ్యమంత్రి వద్ద ఎలా ఉండాలి..? అదానీ ఎలా ఉన్నారనే దానిపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. కాగా...మోడీ అంతటి వాడే..అదానీ చేతిలో పావుగా మారాడని, ఇక చంద్రబాబు, లోకేష్‌లు ఎంతని వాళ్ల సమర్థించేవాళ్లు కామెంట్లు పెడుతున్నారు. మొత్తం మీద..అదానీ వ్యవహారంలో..తప్పులేకపోయినా..చంద్రబాబు, ఆయన తనయుడు విమర్శలను ఎదుర్కొంటున్నారు.