అప్పటి ఓటమికి అదొక్కడే కారణమా...? ఇంకేమీ లేవా...!?
2019 ఎన్నికల్లో తన పార్టీ ఘోరంగా ఓడిపోవడానికి మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కుట్రను బయటపెట్టలేకపోవడమే కారణమని టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. మంగళవారం నాడు ఆయన కానిస్టేబుళ్లగా ఎన్నికైన వారికి నియమాకపత్రాలు అందజేసి, తరువాత జరిగిన సభలో ప్రసంగించారు. వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు..తాను కూడా ఆయన గుండెపోటుతో మరణించారని భావించానని, కానీ..తరువాత రోజు సాక్షి దినపత్రికలో తన చేతిలో కత్తిపెట్టి నారాసుర రక్తచరిత్ర అని రాశారని, దాంతో...అది నమ్మిన ప్రజలు తనను ఓడించారని ఆయన చెప్పుకున్నారు. దాదాపు ఆరేళ్ల క్రితం టిడిపి ఓటమికి ఆయన ఇప్పుడో సాకును వెతుకుంటున్నట్లుంది ఆయన ప్రసంగం. అప్పటి ఆయన ఓటమికి వివేకానందరెడ్డి హత్య ఓ చిన్న కారణమే తప్ప..పూర్తిగా ఆయన ఓటమికి అదే కారణం కాదు. అప్పట్లో ఆయన ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా ఎమ్మెల్యేలు, మంత్రుల ప్రవర్తన. వాళ్లు ప్రజలతో వ్యవహరించిన తీరు. నాటి అధికారు తీరు కూడా మరో కారణం.
అప్పట్లో ప్రజల్లో సంతృప్తి స్థాయి అంటూ....అధికారులు చంద్రబాబు కళ్లకు గంతలు కట్టారు. (ప్రస్తుతమూ కడుతున్నారనుకోండి...ఇప్పుడు అంతకంటే.. ఎక్కువగానే..సంతృప్తి స్థాయిలంటూ..నివేదకలు ఇస్తూ..చంద్రబాబును మభ్య పెడుతున్నారు). అప్పట్లో టిడిపి ఓటమికి ఎమ్మెల్యేల, మంత్రుల అవినీతి, అరాచకం ఓ కారణం కాగా..పార్టీ కార్యకర్తలను పట్టించుకోకపోవడం మరో కారణం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పనిచేసిన వారిని అందలం ఎక్కిస్తానని పదే పదే చెప్పే చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వాళ్లను అలవోకగా మరిచిపోయి.. అధికారుల పంచన చేరి పాలనంతా వారి చేతిలో పెట్టేసి, సమీక్షలు, సమావేశాలు.. సంతృప్తస్థాయిలు, లక్షల కోట్ల పెట్టుబడులు, ప్రపంచస్థాయి రాజధాని, ఐటి, బీటీ..అంటూ...ఏవేవో..ప్రజలు అర్థం కాని మాటలు మాట్లాడుతూ..దానిలోనే తేలిపోతుంటారు. ఈలోగా జగన్ బ్యాచ్ చేయాల్సిన దుష్ప్రచారం చేసేస్తుంటుంది. వాస్తవాని కన్నా..అసత్యాలనే ప్రజలు నమ్మేస్తారు. అప్పట్లో అమరావతిని భ్రమరావతి, కమ్మరావతి అంటే మెజార్టీ ప్రజలు నమ్మేశారు. దాన్ని తిప్పికొట్టలేక.. చంద్రబాబు అండ్ కో అభాసుపాలయ్యారు. వివేకానందరెడ్డిని వారే చంపేసి.. ఆహత్యను చంద్రబాబుపైకి తోసేస్తే..దాన్ని నేర్పుగా తిప్పికోట్టలేకపోయి..ఇప్పుడు అప్రమత్తతో లేనంటూ..ఏవేవో కబుర్లు చెబుతున్నారు. వివేకానందరెడ్డి హత్య కేసు ఒక్కటేనా..కోడికత్తి కేసు..ఏమయింది..? తుని రైలు దహనం కేసు ఏమయింది...? 38 మంది కమ్మ డిఎస్సీల సంగతి ఏమయింది..? ఒకటా..అరా..ఎన్నెన్ని విష ప్రచారాలు..ఎన్నెన్ని అర్థం పర్థం లేని ఆరోపణలు.. ఇక్కటంటే..ఒక్కటి తేల్చారా..? లేదు కదా..మరెందుకు..వివేకానందరెడ్డి హత్య వల్లే ఓడిపోయామని చెప్పుకోవడం..?
సరే..అప్పట్లో జగన్ సంగతి తెలియక..అలా చేశారనుకుందాం..మరి ఇప్పుడేమి చేస్తున్నారు..ఇప్పూడూ జగన్ అదే రీతిలో..అసత్యాలు, అర్థసత్యాలు, ఆరోపణలు చేస్తున్నారు కదా..? వాటిని తిప్పికొడుతున్నారా..? సూపర్ సిక్సూ లేదూ..సూపర్ సెవెనూ లేదంటూ..జగన్ అర్థనేత్రాలతో..అసత్యాలను వల్లిస్తుంటే..ఒక్కరంటే.. ఒక్కరైనా దాన్ని ధీటుగా తిప్పికొడుతున్నారా..? ప్రజలకు వివరిస్తున్నారా..? తల్లికివందనం, మహిళలకు ఫ్రీ బస్సు, రైతులకు రూ.20వేలు, రూ.4వేల ఫింఛన్లు, అన్న క్యాంటీన్లు.. మత్స్యకారులకు రూ.20వేలు..ఇలా ఇచ్చిన ప్రతి హామీనీ నెరవేరుస్తున్నా..జగన్ చేసిన ప్రచారాన్నే ప్రజలు ఎందుకు నమ్ముతున్నారు.. ఎందుకుంటే..టిడిపి చేతకానితనంతోనే..కదా...అప్పట్లో అప్రమత్తత తేదంటున్నారు..ఇప్పుడైనా..అప్రమత్తతో ఉంటున్నారా..? 0.99పైసలకే ఎకరం భూములు పందేరం చేస్తూ అవినీతి చేస్తున్నారని జగన్ అతని మందిమాగాధులు ప్రచారం చేస్తుంటే....చంద్రబాబు అండ్ కో ఏం చేస్తున్నారు..చూస్తూనే ఊరుకుంటు న్నారుగా..మరి అప్రమత్తత ఏది..? ఎందుకు ఇలాంటి కబుర్లు..? రేపటి ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత కూడా..ఇలాంటి సాకు ఏదో దొరకుతుంది. క్షేత్ర స్థాయిలో ఏమి జరుగుతుందో.. గమనించకుండా..ప్రజల అసలు కష్టాలు ఏమిటో పట్టించుకోకుండా.... వాళ్లకు ఏమి కావాలో తెలుసుకోకుండా... ఎంత సేపూ సమావేశాలు.. సమీక్షలు, కలెక్టర్ల కాన్ఫిరెన్స్‌లు, ఐటి కారిడార్లు, డేటా సెంటర్లు, లక్ష కోట్ల పెట్టుబడులు..ఇంకేదో..చెప్పుకుంటూ కాలం గడిపేస్తే సరిపోతుంది. తరువాత..మళ్లీ మీ నినాదం ఉంది కదా..తమ్ముళ్లూ..ఈసారి ఎవరినీ వదలను..? అంతు తేలుస్తా..అంటూ ఊగిపోతారు..మీ తమ్ముళ్లు మరోసారి..మీ వెంటే ఉంటారు.అదే కదా...మీ ధీమా..? సరే కానివ్వండి..?