కృష్ణారెడ్డి ప్రాణ‌మా-వైకాపా పార్టీ ప‌రువా...? ఏది నెగ్గుతుంది...?

26, Dec 2025

సోష‌ల్ మీడియాలో ఇప్పుడో పోస్టు తెగ వైర‌ల్ అవుతోంది. వైకాపాకు చెందిన ఎన్ఆర్ఐ కార్య‌క‌ర్త  కృష్ణారెడ్డి ప‌క్ష‌వాతానికి గురై హాస్ప‌ట‌ల్‌లో చేరారు. అయితే.. ఇప్పుడు హాస్ప‌ట‌ల్ ఖ‌ర్చు భ‌రించ‌డం ఆయ‌న వ‌ల్ల కావ‌డం లేదు. డాక్ట‌ర్లు ఇప్ప‌టికే ఆప‌రేష‌న్ చేసినా..ఆయ‌న ప‌రిస్థితి విష‌మంగానే ఉంద‌ట‌. ఆయ‌న‌కు ఇన్సూరెన్స్ లేక‌పోవ‌డంతో..ఇప్పుడు సొమ్ముల‌కు క‌ట‌క‌ట‌లాడుతున్నార‌ట‌. ఆయ‌న హాస్ప‌ట‌ల్ అయిన త‌రువాత కోలుకోవ‌డానికి దాదాపు $250K (ఇండియ‌న్ క‌రెన్సీలో దాదాపు రెండున్న‌ర కోట్లు) అవ‌స‌రం అవుతుంద‌ట‌. అంత భ‌రించే ప‌రిస్థితి అత‌నికి లేద‌ట‌. అయితే..ఆయ‌న‌ను ఆదుకోవ‌డానికి ఆయ‌న స్నేహితులు, ఇత‌రులు శాయ‌శ‌క్తులా ప్ర‌య‌త్నిస్తున్నారు. గో ఫండ్‌లో ఫండ్ కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నా..ఇప్ప‌టి వ‌ర‌కూ క‌నీసం 10శాతం కూడా పోగ‌వ‌లేద‌ట‌. దీంతో ఆయ‌న ప్రాణాలు కాపాడ‌డం ఎలా అనే ప్ర‌శ్న‌తో ఆయ‌న స్నేహితులు అష్ట‌క‌ష్టాలు ప‌డుతున్నార‌ట‌. త‌మ స్నేహితుడి ప్రాణాన్ని నిల‌బెట్టేందుకు ర‌క‌ర‌కాలుగా య‌త్నిస్తున్నార‌ట‌. అయితే..ఆయ‌న స్నేహితుల్లో ఒక‌రిద్ద‌రికి టిడిపి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మంత్రి లోకేష్‌ను స‌హాయం అడుగుదామ‌ని అంటే..వారి స్నేహితుల‌కు అహం అడ్డువ‌చ్చింద‌ట‌. మ‌న పార్టీ కోసం ప‌నిచేసిన కృష్ణారెడ్డి కోసం లోకేష్‌ను స‌హాయం అడ‌గ‌ట‌మా..? ఇది పార్టీ ప‌రువు తీయ‌డ‌మే క‌దా..అని వారించార‌ట‌. ఒక వైపు కృష్ణారెడ్డి ప్రాణాలు గాలిలో క‌లిసే ప‌రిస్థితి వ‌చ్చినా..ఆయ‌న న‌మ్ముకున్న జ‌గ‌న్ న‌యాపైసా విధించ‌లేదు. రెండున్న‌ర కోట్లు అంటే..జ‌గ‌న్‌కు పెద్ద లెక్కేం కాదు. ఆయ‌న‌కు ఉన్న ల‌క్షల కోట్ల సంపాద‌న‌లో ఈ మొత్తం ఒక లెక్కే కాదు. కానీ..పిల్లికి బిచ్చం పెట్ట‌ని జ‌గ‌న్ త‌న అభిమాని కోసం...అంత ఇవ్వ‌లేక‌..ఆయ‌న మాన‌న ఆయ‌న‌ను వ‌దిలేశార‌ట‌. ఒక‌వైపు జ‌గ‌న్ స‌హాయం చేయ‌క మ‌రోవైపు పార్టీ ప‌ట్టించుకోక‌పోవ‌డంతో..ఈ కృష్ణారెడ్డి అనే వైకాపా క‌రుక‌ట్టిన కార్య‌క‌ర్త ప్రాణాలు ఎప్పుడు గాలిలో క‌లిసిపోతాయ‌నే భ‌యం ఆయ‌న స్నేహితుల్లో క‌నిపిస్తోంది. మాట అడిగితే..లోకేష్ స‌హాయం చేస్తాడు..కానీ...పార్టీ ప‌రువు పోతోంది..అనే భ‌యంతో.. ఆయ‌న‌ను అడ‌గ‌నీయ‌కుండా కొంద‌రు పార్టీ నేత‌లు వారిస్తున్నార‌ట‌. ఇప్పుడు వైకాపా వారి ప‌రిస్థితి ఎలా ఉందంటే..ఇంద్ర సినిమాలో చిరంజీవి ప్ర‌తినాయ‌కుడి కుమారుడిని కాపాడితే..త‌న ప్ర‌త్య‌ర్థి ద్వారా ప్రాణాలు నిల‌బెట్టుకున్న క‌న్న కుమారుడ్నే ప్ర‌తినాయ‌కుడు చంపేస్తాడు...ఇప్పుడు వైకాపా నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల తీరు అదే విధంగా ఉంది. వాళ్ల‌ నాయ‌కుడేమో స‌హాయం చేయ‌డు..వీళ్లేమో స‌హాయం చేసేవారిని అడ‌గ‌లేరు. మొత్తం మీద‌...కృష్ణారెడ్డి ప్రాణం కంటే..పార్టీ ప‌రువే వైకాపా నాయ‌కుల‌కు ముఖ్యమ‌ని తేలిపోయింద‌ని ఎన్ఆర్ఐలు అంటున్నార‌ట‌. 


కొస‌మెరుపుః నిన్న మొన్న‌టి దాకా..లోకేష్‌ను, చంద్ర‌బాబును, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను నానా తిట్టులు, బూతులు తిట్టిన కృష్ణారెడ్డి ప్రాణాల‌ను కాపాడాల‌ని కొంద‌రు టిడిపి ఎన్ఆర్ఐ కార్య‌క‌ర్త‌లు కోరుకుంటున్నారు. అత‌ను ఏ పార్టీ వాడైనా..పాపం..అత‌నికీ కుటుంబం, పిల్ల‌లు ఉంటారు క‌దా..ఏదో ర‌కంగా ఆదుకోవాల‌ని కోరుతున్నారు. లోకేష్ లండ‌న్ ప‌ర్య‌ట‌న చేసిన‌ప్పుడు లోకేష్ ఫోటోల‌ను కాలితో త‌న్నిన కృష్ణారెడ్డి ప‌ట్ల టిడిపి కార్య‌క‌ర్త‌లు సానుభూతి చూపించ‌డం నిజంగా ఆశ్చ‌ర్య‌క‌ర‌మే. ఒక‌ర‌కంగా ఆనందం క‌ల్గించేదే. రాజ‌కీయాల్లో క‌క్ష‌పూరిత విధానాలను విడ‌నాడి ప‌గ‌వాడైనా..బ‌తకాల‌ని కోరుకోవ‌డం సంతోషించాల్సిన విష‌య‌మే..!


(2)
(0)

Comments