లోకేష్ టీమ్‌లోకి అన్సారియా
రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు కొంత మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. కలెక్టర్లగా ఉన్న ఇద్దరిని కీలకమైన శాఖల్లోకి తీసుకుంది. గుంటూరు జిల్లా కలెక్టర్‌గా ఉన్న Thameem Ansariyaను విద్యాశాఖ డైరెక్టర్‌గా బదిలీ చేసింది. ఈమె బదిలీపై కొన్ని రోజులుగా చర్చ సాగుతోంది. దీనిపై janamonline.com గతంలోనే ఒక కథనాన్ని ఇచ్చింది. ఆమెను లోకేష్ టీమ్‌లోకి తీసుకుంటారని, ఆమె పనితీరుపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, అందుకే ఆమెను తన శాఖలోకి తీసుకుంటున్నారని ఆ కథనంలో ప్రస్తావించాం. (https://www.janamonline.com/home/news_item/197) దానికి అనుగుణంగానే ఆమెను విద్యాశాఖ డైరెక్టర్‌గా నియమించారు. కాగా అల్లూరి సీతారామరాజు కలెక్టర్‌గా ఉన్న దినేష్‌కుమార్ పనితీరుపై ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, ఆయనను కీలకమైన శాఖను అప్పగిస్తారని janamonline.com చెప్పింది. దానికి అనుగుణంగానే ఆయనను ఎపిఐఐసి మేనిజింగ్ డైరెక్టర్‌గా నియమించారు. ఇక ప్రస్తుతం EDB CEOగా ఉన్న సాయికాంత్ వర్మను కలెక్టర్‌గా నియమిస్తారని, అదే సమయంలో APIIC, Managing Directorగా ఉన్న Abhishikth Kishoreనూ కలెక్టర్‌గా నియమిస్తారని కూడా janamonline.com చెప్పింది. janamonline చెప్పిన విధంగానే వీరిద్దరికీ కలెక్టర్లుగా అవకాశం ఇచ్చారు. వీరిలో సాయికాంత్ వర్మను కీలకమైన గుంటూరు జిల్లా కలెక్టర్‌గా నియమించింది. అదే విధంగా Abhishikth Kishoreను మరో కీలకమైన విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది. కాకినాడ జిల్లా కలెక్టర్ శాన్‌మోహన్‌ను బదిలీ గురించి కూడా janamonline ముందే చెప్పింది. జిల్లా రాజకీయాల్లో ఆయన నలిగిపోతున్నారని, జనసేన, టిడిపి నాయకుల మధ్య ఉన్న విభేదాలతో ఆయన తట్టుకోలేకపోతున్నారని, ఆయన బదిలీ ఉంటుందని janamonline తన కథనంలో పేర్కొంది. దానికి అనుగుణంగానే ఆయనను EDB CEOగా బదిలీ చేశారు. మొత్తం మీద కొంత మంది కీలక ఐఏఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. మరి కొంత మంది బదిలీపై ఇంకా కసరత్తులు జరుగుతున్నాయి.