ముంబాయి ఘ‌న‌విజ‌యం

29, Mar 2026

ఐపిఎల్ మ్యాచ్‌లో ఈరోజు కోల్‌క‌త్తాతో జ‌రిగిన మ్యాచ్‌లో ముంబాయి ఘ‌న‌విజ‌యం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌క‌తా 20ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి 220 ప‌రుగుల భారీ స్కోరు సాధించింది. అయితే..ఈ భారీ స్కోరును ముంబాయి సునాయాసంగా నాలుగు వికెట్లు కోల్పోయి మ‌రో ఐదు బంతులు మిగిలి ఉండ‌గానే ఛేదించింది. భార‌త్ మాజీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగిపోయారు. అత‌నికి రికెల్ట‌న్ స‌హ‌క‌రించ‌డంతో తొలి వికెట్‌కు వారిద్ద‌రూ క‌లిసి 11.5 ఓవ‌ర్ల‌లో 148 ప‌రుగులు జోడించారు. అయితే 38బంతుల్లో 6ఫోర్లు, 6సిక్స‌ర్ల‌తో 78 ప‌రుగులు చేసిన రోహిత్ శ‌ర్మ అరోరా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. అయితే.. రోహిత్ శ‌ర్మ ఆడుతున్న సేపు కొంచెం నెమ్మ‌దిగా ఆడిన రికెల్ట‌న్ త‌రువాత రెచ్చిపోయాడు. అత‌ను 43 బంతుల్లో 81 ప‌రుగులు సాధించాడు. దీనిలో 8 సిక్స్‌లు, 4 ఫోర్స్ ఉన్నాయి. రాయ్ బౌండ‌రీ లైన్ వ‌ద్ద నుంచి నేరుగా వేసిన త్రోకు రికెల్ట‌న్ ర‌నౌట్‌గా వెనుతిర‌గాల్సి వ‌చ్చింది. త‌రువాత వ‌చ్చిన సూర్య‌కుమార్ యాద‌వ్ మూడు ఫోర్ల‌తో 16 ప‌రుగులు చేసి త్యాగి బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. అయితే పాండ్య‌న్‌, తిల‌క్ వ‌ర్మ కోల‌క‌తాకు ఎటువంటి అవ‌కాశం ఇవ్వ‌లేదు. అయితే...తిల‌క్ మ్యాచ్‌ను తొంద‌ర‌గా ముగించాల‌నే తొంద‌ర‌లో ఓ భారీ షాట్ ఆడ‌బోయి అవుట్ అయ్యాడు. అయితే అప్ప‌టికే ముంబాయి విజ‌యం ఖాయ‌మైపోయింది. విజ‌యానికి కావాల్సిన  ముంబాయికి ఈ సీజ‌న్‌లో తొలి విజ‌యాన్ని అందించారు. ఐపిఎల్ ప్రారంభం అయిన 13 ఏళ్ల త‌రువాత‌ తొలి మ్యాచ్ గెల‌వ‌డం ముంబాయికి ఇదే తొలిసారి.  అంత‌కు ముందు కోల‌క‌తా ఇన్సింగ్స్‌లో వెట‌ర‌న్ కోల‌క‌తా కెప్టెన్ ర‌హేనే అర్థ‌సెంచ‌రీ సాధించాడు. అత‌ను 40 బంతుల్లో 5 సిక్స్‌లు, మూడు ఫోర్ల‌తో 67 ప‌రుగులు సాధించాడు. అత‌నికి ర‌ఘువంశీ స‌హ‌క‌రించాడు. ర‌ఘువంశీ 29 బంతుల్లో 51 ప‌రుగులు సాధించాడు. దీనిలో 5 ఫోర్లు, మూడు సిక్స్‌లు ఉన్నాయి. రింకూసింగ్ 31, ఫిల్ ఆలెన్ 37 ప‌రుగులు చేయ‌డంతో కోల్‌క‌తా భారీ స్కోరు సాధించింది. ముంబాయి బౌల‌ర్లల్లో శార్ధూల్ ఠాగూర్ మూడు వికెట్లు తీసుకున్నాడు.  


(0)
(0)

Comments

తాజా పోల్

జ‌గ‌న్ మ‌ళ్లీ గెలుస్తార‌నే భ‌యంతోనే రాజ‌ధాని అమ‌రావ‌తిపై అసెంబ్లీలో తీర్మానం చేశారా?

VOTE PLEASE