లక్నోపై ఢిల్లీ గెలుపుః రిజ్వీ అర్థసెంచరీ
లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్ మధ్య ఈ రోజు జరిగిన మ్యాచ్ హోరా హోరిగా జరిగింది.ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ ఓ మోస్తరు స్కోరు సాధించింది. మొత్తం 20 ఓవర్లు ఆడలేకపోయింది. 18.4 141 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్‌కు మొదటి బాల్‌తోనే షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ కె.ఎల్ రాహుల్‌ను తొలి బంతికే సమీ అవుట్ చేశాడు. రాహుల్ అవుట్ అయిన తరువాత నితీష్ రాణా కొన్ని షాట్ల్ ఆడినా మోసిన్‌ఖాన్ బౌలింగ్‌లో సమాద్ పట్టిన క్యాచ్‌కు అవుట్ అయ్యాడు. ఆ వెంటనే ఢిల్లీ వరుసగా వికెట్లును కోల్పోయింది. నిశాంక, అక్షర్ పటేల్‌లు వెంట వెంటనే అవుట్ కావడంతో ఢిల్లీ క్యాపిటల్ 26 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. అయితే...ఆ జట్టును సమీర్, స్టాబ్స్ ఆదుకున్నారు. సమీర్ అర్థసెంచరీ సాధించి జట్టును కష్టాల నుంచి బయటపడేశాడు. సమీర్ రిజ్వీ 47 బంతుల్లో ఐదు ఫోర్లు, నాలుగు సిక్స్‌లతో (70) నాటౌట్ పరుగులు చేసి ఢిల్లీ గెలుపులో కీలకపాత్ర పోషించాడు. స్టబ్స్ (39) నాటౌట్ కూడా తన వంతు సహకార అందించాడు. మొత్తం మీద ఢిల్లీ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. అంతకు ముందు తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్‌కు వరుసగా ఎదురు దెబ్బలు తగిలాయి. కెప్టెన్ పంత్ 7 పరుగులకు అవుట్ కాగా, మిగతా వారంతా ఓ మోస్తరు స్కోరు చేశారు. మిచెల్ మార్ష్ (35) అబ్దుల్ సమాద్ (36)తో ఆ మాత్రమైనా స్కోరు చేయగలిగారు. ఢిల్లీ క్యాపిటల్ బౌలర్లలో నిగిడి మూడు వికెట్లు తీయగా, నటరాజన్ మూడు, కులదీప్‌యాదవ్ రెండు వికెట్లు తీశారు.