కోలకతాపై సన్‌రైజర్స్ సూపర్ విక్టరీ
ఈ రోజు జరిగిన కోలకతా సన్‌రైజర్స్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ సూపర్ విక్టరీ సాధించింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో రాణించి కోలకతాపై 65 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 226 పరుగులు సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ ఓపెనర్స్ చెలరేగిపోయారు. అభిషేక్ శర్మ, ట్రేవిస్ హెడ్ తొలి వికెట్ కు 82 పరుగులు సాధించారు. హెడ్ 21 బంతుల్లో 6ఫోర్లు, మూడు సిక్స్‌లతో 46 పరుగులు చేయగా, అభిషేక్ శర్మ 21 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 48 పరుగులు చేశాడు. 5.4 ఓవరల్లోనే సన్‌రైజర్స్ 84 పరుగులు చేయడంతో సన్‌రైజర్స్ భారీ స్కోరు చేస్తుందని అందరూ భావించారు. దానికి అనుగుణంగానే సన్‌రైజర్స్ బ్యాటింగ్ కొనసాగింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ (14), కలసెన్ (52) పరుగులు నిశాంత్ కుమార్ రెడ్డి (39)లు రాణించడంతో సన్ రైజర్ 226 పరుగులు చేయగలిగింది. అయితే 227 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోలకతా ఆరంభంలోనే కెప్టెన్ రహానే వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన రహానేను ఉన్కద్ అవుట్‌చేశాడు. అయితే మరో ఎండ్‌లో ఉన్న ఫిల్ అలెన్ 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 7 బంతుల్లోనే 28 పరుగులు చేసి కోలకతాను పోటీలో నిలిపాడు. అతనికి రఘువంశీ సహకరించడంతో కోలక్‌తా లక్ష్యంపై ధీమాతోనే కనిపించింది. రఘు వంశీ 29 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 52 పరుగులు చేశాడు. దీంతో..కోల్‌కతా విజయం నల్లేరుపై నడేక అనిపించింది. అయితే రఘువంశీ రనౌట్ కావడం, తరువాత గ్రీన్ కూడా రనౌట్ కావడంతో..కోలకతా అవకాశాలు మూసుకుపోయాయి. కాసేపు రింకుసింగ్ మెరుపులు మెరిపించినా..అది అంతరం తగ్గడానికే తోడ్పడింది. రింకూ 25 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్‌తో 35 పరుగులు చేశాడు. అయితే..తరువాత వచ్చిన బ్యాట్స్‌మెన్ వెంట వెంటనే అవుట్ కావడంతో కోలకతా 16 ఓవర్లలోనే 161కి ఆలౌట్ అయింది. సన్‌రైజర్స్ బౌలర్లలో ఉన్కదత్ మూడు, ఇషాన్ మలింగ్ రెండు, నితీష్‌కుమార్‌రెడ్డి రెండు వికెట్లు తీశారు. కాగా బ్యాటింగ్‌లో 39 పరుగులు, రెండు వికెట్టు తీసిన నిషాంత్ కుమార్‌రెడ్డికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.