హోరా హోరి మ్యాచ్‌లో రాజస్థాన్ గెలుపు
అహ్మదాబాద్, మార్చి 04ః రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్ మధ్య హోరా హోరిగా జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇరు జట్లు 200 పరుగులు చేసిన ఈ మ్యాచ్ ఆఖరి బాల్ వరకూ ఉత్కంఠత నెలకొంది. ఆఖరి రెండు బంతులకు 7 పరుగులు చేయాల్సిన పరిస్థితుల్లో గుజరాత్ కెప్టెన్ రషీద్‌ఖాన్ సిక్స్ కోసం ప్రయత్నించి అవుట్ కావడంతో రాజస్థాన్ రాయల్స్ గెలుపు ఖాయమైంది. ఆఖరి ఓవర్‌లో 6 బంతులకు 11 పరుగులు చేయాల్సిన పరిస్థితుల్లో దేశ్‌పాండే చివరి ఓవర్ వేశాడు. అతను ఈ ఓవర్ అద్బుతంగా వేశాడు. మొదటి మూడు మొదటి బంతిని వైడ్ వేసిన అతను తరువాత మూడు బంతులకు మూడు పరుగులే ఇచ్చాడు. నాలుగో బంతికి పరుగు ఇవ్వలేదు. ఇక ఐదో బంతికి అతను రషీద్‌ఖాన్‌ను అవుట్‌చేయడంతో రాజస్థాన్ గెలుపు ఖాయమైపోయింది. అంతకు ముందు గుజరాత్ బ్యాట్స్‌మెన్ రెండువందలకు పైగా ఉన్న లక్ష్యాన్ని సాధించడానికి హోరా హోరిగా పోరాడింది. ఓపెనర్ సాయి సుదర్శన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అతను 44 బంతుల్లో 9 ఫోర్లు, మూడు సిక్స్‌లతో 77 పరుగులు చేశాడు. అతను బ్యాటింగ్‌చేస్తోన్నంత సేపు గుజరాత్ విజయం ఖాయమన్న భావన వ్యక్తం అయింది. అయితే..అతను ఔట్ అయిన తరువాత గుజరాత్ వేగంగా పరుగులు చేయలేక చేతులు ఎత్తేసింది. అయితే ఆఖరులో రబాడా, రషీద్ ఖాన్‌లు గట్టిగా పోరాడారు. వారి పోరాటంతో గుజరాత్ గెలిచే అవకాశాలు సృష్టించుకుంది. అయితే..చివరకు రాజస్థాన్ బౌలర్ దేశ్‌పాండే ఆఖరి ఓవర్ అద్భుతంగా వేయడంతో గుజరాత్‌కు పరాభవం తప్పలేదు. రాజస్థాన్ బౌలర్లలో రవిబిష్టోయి 41 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. అతనికే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్ కెప్టెన్ పరాగ్ బ్యాటింగ్‌కు ఎంచుకున్నాడు. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్ భారీ స్కోరు సాధించింది. ఆ జట్టు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ, మరో యువ ఆటగాడు జైస్వాల్‌లు శుభారంభం ఇచ్చారు. ఇద్దరూ గుజరాత్ బౌలర్లును ఒక ఆట ఆడుకున్నారు. ఫోర్లు, సిక్స్‌లతో స్కోరును పరుగులెత్తించారు. ఒకరితో ఒకరు పోటీ పడి పరుగులు సాధించారు. ఒకరు ఫోర్ కొడితే మరొకరు సిక్స్ ఇలా పోటీ పడి ఈ ఇద్దరు గుజరాత్ బౌలర్లును బెంబేలెత్తించారు. ఇద్దరూ కలిసి మొదటి వికెట్‌కు 6.2 ఓవర్లలో 70 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా మారుతోన్న ఈ జోడీని రషీద్‌ఖాన్ విడదీశాడు. రషీద్‌ఖాన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన వైభవ్ సూర్యవంశీ ఫిలిఫ్స్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. తరువాత ద్రువ్ జ్యూరెల్, జైస్వాల్ లు రాజస్థాన్‌కు మరింత మెరుగైన స్కోరు అందించారు. ఈ క్రమంలోనే జైస్వాల్ అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతను 36 బంతుల్లో 6 ఫోర్లు, మూడు సిక్స్‌లతో 55 పరుగులు సాధించాడు. జైస్వాల్‌ను రబాడ క్లీన్ బౌల్డ్ చేశాడు. అయితే జైస్వాల్ అవుట్ అయినా..జూరెల్ మాత్రం తగ్గలేదు. ఎడాపెడా ఫోర్లు,సిక్స్‌లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. 42 బంతుల్లో 5ఫోర్లు, 5 సిక్స్‌లతో అతను 75 పరుగులు సాధించాడు. అయితే..అతను అవుట్ అయిన తరువాత అనుకున్నంత వేగంగా రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్‌మెన్ పరుగులు సాధించలేకపోయారు. చివరకు 6 వికెట్లకు 210 పరుగులకు రాజస్థాన్ ఇన్నింగ్స్ ముగిసింది. కాగా ఆడిన రెండు మ్యాచ్‌ల్లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించి పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో నిలిచింది. మరోవైపు గుజరాత్ టైటాన్స్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఆదివారం నాడు సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్‌జైయింట్స్ తలపడుతుండగా, ఇంకో మ్యాచ్‌లో రాయల్‌ఛాలెంజర్ బెంగుళూరు, చెన్నై సూపర్ కింగ్ పోటీపడుతున్నాయి.