రాయల్‌ఛాలెంజర్స్ ఘన విజయం
చెలరేగిన టిమ్ డేవిడ్ః 70 నాటౌట్
బెంగుళూరు, ఏప్రిల్ 05ః బెంగుళూరు వేదికగా జరిగిన చెన్నె, రాయల్‌ఛాలెంజర్స్ బెంగుళూరు మ్యాచ్‌లో బెంగుళూరు ఘన విజయంసాధించింది. ఈమ్యాచ్‌లో బెంగుళూరు 43 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత చెన్నె టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. అయితే..బ్యాటింగ్‌కు అనుకూలిస్తోన్న ఈ పిచ్‌పై బౌలింగ్ ఎంచుకోవడం చెన్నెని తీవ్రంగా దెబ్బతీసింది. బెంగుళూరు బ్యాట్స్‌మెన్ ప్రతి ఒక్కరూ ఈ పిచ్‌పై రాణించడంతో ఆ జట్లు మూడు వికెట్లకు 250 పరుగులు చేసింది. అయితే 251 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నె ఏ దశలోనూ ఆ స్కోరు అందుకునే ప్రయత్నం చేయలేదు. చెన్నె ఓపెనర్స్ సంజూ, గైక్వాడ్‌లు చెరో సిక్స్ బాది, భారీ స్కోరు అందుకోవాలనే భావనతో భారీ షాట్లు ఆడారు. అయితే..వీరిద్దరూ వెంట వెంటనే అవుట్ కావడం...తరువాత వచ్చిన ఆయుష్ మాత్రే వెంటనే అవుట్ అవడంతో 30 పరుగులకే చెన్నె మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే..సర్ఫరాజ్‌ఖాన్ కొన్ని షాట్లు ఆడాడు. ఫోర్లు, సిక్స్‌లతో విరుచుకుపడిన అతను 25 బంతుల్లో 2 సిక్స్‌లు, 8 ఫోర్లతో అర్థ సెంచరీ సాధించాడు. అయితే..అర్థ సెంచరీ చేసిన వెంటనే అతను కృణాల్ పాండ్యా బౌలింగ్‌లోఅవుట్ అయ్యాడు. సర్ఫరాజ్ తరువాత ప్రశాంత్ వీర్, ఓవర్టన్‌లు కొన్ని బౌండరీలు, సిక్స్‌లు కొట్టినా..అది స్కోరు అంతరాన్ని తగ్గించడానికే పనికి వచ్చింది తప్ప..విజయాన్ని అందించలేదు. మొత్తం మీద చెన్నె 19.4 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌట్ అయింది. మొదట చెన్నె బౌలర్ ఖలీల్ కట్టుదిట్టంగా బంతులు వేయడంతో బెంగుళూరు ఓపెనర్స్ కోహ్లీ, స్టాల్‌లు ఆచితూచి ఆడారు. అయితే దూబే ఒక క్యాచ్ వదిలేయడంతో లైఫ్ దక్కిన కోహ్లీ తరువాత దాన్ని సద్వినియోగం చేసుకుని సిక్స్,ఫోర్‌తో చెలరేగిపోయాడు. అయితే ఆ వెంటనే కాంబోజ్ వేసిన ఓ బంతిని భారీ షాట్ ఆడబోయి కోహ్లీ దూబే పట్టిన క్యాచ్‌కు అవుట్ అయ్యాడు. అప్పటికి బెంగుళూరు స్కోరు 43/1. అయితే తరువాత పడిక్కల్ ఎడాపెడా బౌండరీలు, సిక్స్‌లు బాదేశాడు. అతనికి స్టాల్‌లు జతకలవడంతో బెంగుళూరు స్కోర్ వేగంగా కదిలింది. అయితే 30 బంతుల్లో 2 సిక్స్‌లు, మూడు ఫోర్లతో 40 పరుగులు చేసిన స్టాల్‌ను దూబే అవుట్ చేశాడు. స్టాల్ అవుట్ అయిన తరువాత క్రీజ్‌లోకి వచ్చిన రజిత్ పటిదార్ చెన్నె బౌలర్లుకు చుక్కలు చూపించాడు. అతను పడిక్కల్‌తో కలిసి ఫోర్లు, సిక్స్‌ల వర్షం కురిపించాడు. అతని ఇన్నింగ్స్‌లో ఆరు సిక్స్‌లు కొట్టాడంటే అతను ఎంత వేగంగా ఆడాడో అర్థం చేసుకోవచ్చు. అర్థ సెంచరీ పూర్తి చేసుకున్న పడిక్కల్‌ను ఓవర్టన్ బౌల్డ్ చేయడంతో బెంగుళూరు మూడో వికెట్ కోల్పోయింది. అయితే..తరువాత వచ్చిన టిమ్ డేవిడ్ విధ్వంసం సృష్టించాడు. సిక్స్‌లతో చెలరేగిపోయిన డేవిడ్ ఇన్నింగ్స్ 19 ఓవర్లలో ఏకంగా 30 పరుగులు సాధించాడు. దీనిలో నాలుగు సిక్స్‌ర్లు, ఒక ఫోర్ ఉంది. వరుసగా హ్యాట్రిక్ సిక్స్‌లు కొట్టి అతను బెంగుళూరు స్కోరును 250 కు చేర్చాడు. మొత్తం అతను 25 బంతుల్లో 8 సిక్స్‌లు, 3 ఫోర్లతో 70 (నాటౌట్) పరుగులుచేశాడు. మరో ఎండ్‌లో ఉన్న కెప్టెన్ పటీదార్ 19 బంతుల్లో 6సిక్స్‌లు, 1 ఫోర్‌తో 48 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కాగా రాయల్ ఛాలెంజర్‌కు ఇది వరుసగా రెండో విజయం. మరోవైపు చెన్నె వరుసగా తన మూడో మ్యాచ్‌లో ఓడిపోయి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది.
బెంగుళూరు స్కోర్ః 250/3
టిమ్ డేవిడ్ః70 నాటౌట్
పడిక్కల్ః50
పటీదార్ః48 నాటౌట్
స్టాల్ః 46
జెమీ ఓవర్టన్ః 42/1
చెన్నెః 206
సర్ఫరాజ్ ఖాన్ః50
ప్రశాంత్ వీర్ః 43
జెమీ ఓవర్టన్ః37
భువనేశ్వర్ కుమార్ః41/3
జాకబ్ డూబేః 58/2
అభినందన్ సింగ్ ః30/2
కృణాల్ పాండ్యాః 36/2