వైభ‌వ్ సూర్య‌వంశీ సూప‌ర్ అర్థ‌సెంచ‌రీ

30, Mar 2026

చెన్నై చిత్తు..చిత్తు...!

టాటా ఐపిఎల్ తొలి మ్యాచ్‌లో చెన్నై చిత్తు చిత్తుగా ఓడిపోయింది. మొద‌ట బ్యాటింగ్‌చేసిన చెన్నె 19.2 ఓవ‌ర్ల‌లో 127 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. అయితే..ఈ స్కోరు రాజ‌స్థాన్‌రాయ‌ల్స్‌కు  ఏ మాత్రం స‌రిపోలేదు. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఓపెన‌ర్స్ వైభ‌వ్ సూర్య‌వంశీ, జైస్వాల్ దంచి కొట్టేశారు. వాళ్లిద్ద‌రూ మొద‌టి ఆరు ఓవ‌ర్ల‌లోనే 59 ప‌రుగులు చేశారు. సూప‌ర్ కిడ్ వైభ‌వ్ సూర్య‌వంశీ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగిపోయాడు. ఫోర్లు,సిక్స్‌ల‌తో విరుచుకుప‌డ్డాడు. 15 బంతుల్లోనే అత‌ను అర్థ‌సెంచ‌రీ చేశాడు. దీనిలో ఐదు సిక్స్‌లు, నాలుగు ఫోర్లు ఉన్నాయి. అయితే అదే ఊపులో ఆడుతోన్న సూర్య‌వంశీ స‌ర్ఫ‌రాజ్‌ఖాన్ ఓ ప‌ట్టిన ఓ సూప‌ర్ క్యాచ్‌కు 52 ప‌రుగుల వ‌ద్ద అవుట్ అయ్యాడు. సూర్య వంశీ త‌రువాత జైశ్వాల్ త‌న‌దైన శైలిలో ఆడి లాంఛ‌నాన్ని పూర్తి చేశాడు. చివ‌ర‌కు 12.1 ఓవ‌ర్ల‌లోనే రాయ‌ల్స్ ల‌క్ష్యాన్ని చేధించింది.    అంత‌కు ముందు మొద‌ట బ్యాటింగ్ చేసిన చెన్నె బ్యాటింగ్‌లో పూర్తిగా విఫ‌లం అయింది. టి20 వ‌ర‌ల్డ్‌క‌ప్ హీరో సంజూశ్యామ‌స‌న్ 6ప‌రుగుల‌కే అవుట్ అయ్యాడు. ఆ త‌రువాత వ‌రుసుగా చెన్నె వికెట్లు కోల్పోతూనే ఉంది. కెప్టెన్ రుత్‌రాజ్ 6 ప‌రుగుల‌కు, మాత్రే సున్నాకు, మ‌ధ్యూషార్ట్ 2 ప‌రుగుల‌కు ఇలా ప్ర‌తి ఒక్క‌రూ రెండంకెల స్కోరు చేయ‌కుండానే వెనుతిరిగారు. మొన్న‌టి దాకా చెన్నెకు ఆడిన ర‌వీంద్ర జడేజా ఇప్పుడు రాయ‌ల్స్‌కు ఆడుతూ కీల‌క‌మైన రెండు వికెట్లు తీశాడు. ఒకే ఓవ‌ర్లో దూబే, స‌ర్ఫ‌రాజ్‌ఖాన్‌ను అవుట్‌చేసి చెన్నెను కోలుకోలేకుండా చేశాడు. అయితే జెమే ఒవ‌ర్‌ట‌న్ మాత్రం దూకుడుగా ఆడి చెన్నె ఈ మాత్రం స్కోరు సాధించ‌డానికి కార‌ణం అయ్యాడు. అత‌ను 36బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్స్‌ల‌తో 46 ప‌రుగులు సాధించాడు. చెన్నె స్కోర్ బోర్డులో ఇదే అత్య‌ధిక స్కోరు. 


(0)
(0)

Comments

తాజా పోల్

జ‌గ‌న్ మ‌ళ్లీ గెలుస్తార‌నే భ‌యంతోనే రాజ‌ధాని అమ‌రావ‌తిపై అసెంబ్లీలో తీర్మానం చేశారా?

VOTE PLEASE