మహిళలపై వైకాపా వ్యూహాత్మక దాడి...!
అధికారం కోల్పోయిన వైకాపా అధినేత వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి మళ్లీ అధికారం సాధించేందుకు ఎంతకైనా తెంగించడానికి సిద్ధపడుతున్నారు. అధికారమే పరమావధిగా ఆయన ఉచ్ఛనీచాలు మరిచిపోయి..మహిళలను దూషించడానికి, వారిని అపహాస్యం చేయడానికి కూడా వెనుకాడడం లేదు. 2024 ఎన్నికలకు ముందు ఎప్పటికీ తనదే అధికారమని, తనను ఎవరూ ఓడించలేరని, తన వెంట్రుక కూడా పీకలేరని బీరాలుపోయి బొక్కబోల్లా పడ్డ ఆయన ఇప్పుడు అధికారం పోయేటప్పటికి గిలగిలాడిపోతున్నారు. ఒకవైపు అధికారం పోయింది..మరోవైపు..వచ్చే ఆదాయం పోయింది..పైగా ఇప్పుడు చేతి సొమ్ములు వదిలించుకోవాల్సిన పరిస్థితి రావడంతో..ఆయనలో అసహనం పరాకాష్టకు చేరుకుంటోంది. ఇలా అసహనం..పెరిగే కొద్ది తాను ఏమి చేస్తున్నాడో అనే సృహ కూడా ఆయనకు ఉండడం లేదు. ఏడాది క్రితం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నుంచే తానుమళ్లీ అధికారంలోకి రావాలని దాని కోసం ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉండాలని ఆయన నిర్ణయించుకున్నారు. అయితే..ఏడాది క్రితం టిడిపి కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు జగన్ ఆలోచనలు వేరుగా ఉండేవి. కూటమి ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, దీంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెరిగిపోతుందని, ఏడాది ముగిసేనాటికి ప్రజలందరూ తనవైపే వస్తారని, మళ్లీ తాను ఎటువంటి కష్టం లేకుండా ముఖ్యమంత్రిని అయిపోతానని కలలు కన్నారు.
అయితే..ఏడాది అయినా..ఆయన అనుకున్నదేమీ జరగలేదు. ఈ ఏడాదిలో కూటమికి వ్యతిరేకంగా ఏ ఒక్కరూ రోడ్డెక్కలేదు. సరికదా..ఎక్కడా నిలదీతలు కూడా లేవు. పోనీ పార్టీ తరుపున తానేమైనా చేద్దామనకున్నా..ఒక్క అవకాశాన్ని కూడా టిడిపి కూటమి తనకు ఇవ్వడం లేదు. దీంతో ఏమి చేయాలో పాలుపోని జగన్ చివరకు అరెస్టు అయిన నేతలను పరామర్శిస్తూ..అక్కడ పోగేసిన జనంతో సిఎం..సిఎం..అంటూ జిందాబాద్‌లు కొట్టించుకుంటున్నారు. అంతేనా..రౌడీ షీటర్లను పోలీసులు కొడితే..వారిని పరామర్శించి..జనం చేత ఛీత్కారాలు పొందారు. దీంతో ఎటు చూసినా..తాను అనుకున్నదేమీ కాకపోవడంతో..వ్యూహాత్మకంగా మహిళలపై దాడులకు దిగారు.
రాజధాని ప్రాంత మహిళలు వేశ్యలు అంటూ..తన ఛానెల్‌లో తన యాంకర్ చేత, మరో కూలీ జర్నలిస్టుతో అనిపించారు. వారి వ్యాఖ్యలతో మహిళా లోకం రెచ్చిపోయి జగన్ కార్యాలయాలపై దాడులకు దిగుతోంది. ఇదే ఇప్పుడు జగన్‌కు కావాల్సింది. తనపైనా, తన భార్యపైనా.. మహిళలు దాడులు చేస్తే..దాన్ని అడ్డుపెట్టుకుని పార్టీని కదిలించాలనేది ఆయన వ్యూహం లాగుంది. నిస్తేజంగా ఉన్న పార్టీ క్యాడర్, నాయకుల్లో మళ్లీ కదలిక తెచ్చేందుకు ఆయన రాజధాని మహిళలపై దాడులకు దిగారు. సాక్షి ఛానెల్ డిబేట్‌లో చేసిన వ్యాఖ్యలు అన్యాపదేశంగా వచ్చినవి కావనీ, అవి ఒక వ్యూహం ప్రకారమే చేసినవని నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి మహిళలను ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలతో తేలిపోయాయి. ఒకవైపు..తన ఛానెల్ యాంకర్‌ను పోలీసులు అరెస్టు చేస్తే..మళ్లీ సజ్జల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఒక వ్యూహంతోనే..ఇలా చేస్తున్నారనేది రుజవైంది. ఒక వైపు తన మనుషులతో రాజధాని మహిళలను తిట్టించడం...దానికి వారు ప్రతిగా ఏమైనా వ్యాఖ్యలు చేస్తే తన భార్యను తిడుతున్నారని బహిరంగంగా ఏడ్వడమే వారి వ్యూహం. తన భార్య కూడా మహిళేనని, తనభార్యపై ఎలా వ్యాఖ్యలు చేస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు. మరి రాజధాని మహిళలపై తన మనుషుల చేత ఎందుకు తిట్టిస్తున్నారంటే సమాధానం ఉండదు. మొత్తం మీద..జగన్ గత ఏడాదిలో కూటమిపై ఏరకంగా ఒత్తిడి తేలేకపోవడంతో..ఇప్పుడు ఉచ్ఛనీచాలు మరిచి మహిళలను లక్ష్యంగా చేసుకుని రాజకీయ లబ్ది పొందేందుకు యత్నిస్తున్నారు. అయితే..గతంలో నంగి ఏడ్పులు ఏడిస్తే..ఆంధ్రా మహిళా లోకం జగన్‌ను నమ్మి ఓటేసింది. కానీ..ఈసారి..ఎన్ని నంగి వేషాలు వేసినా..ఎన్ని నక్క ఏడ్పులు ఏడ్చినా..వారు పట్టించుకోరనే విషయాన్ని ఆయన, ఆయన మందిమాగాధాలు మరిచిపోయి నట్లున్నారు.