మరో వైకాపా అణిముత్యం...!?
వైకాపా ప్రతిపక్షంలోకి రాగానే..అప్పటిదాకా..వైకాపాలో ఒక వెలుగువెలిగిన వారంతా..ఏదో ఒక కేసులో ఇరుక్కుంటున్నారు. కేవలం రాజకీయాలతో సంబంధం ఉన్నవారే కాదు..ఇతర రంగాల్లో ప్రముఖులైన వారు అంటే సినీరంగం, మీడియా రంగంలో పేరు ప్రఖ్యాతులు గాంచిన వారందరూ వరుసపెట్టి..చేసిన తప్పులకు జైళ్లకు వెళుతున్నారు. తాజాగా మీడియా రంగానికి చెందిన సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు జైలుకు వెళ్లారు. అమరావతి మహిళలను ఉద్దేశించిన కృష్ణంరాజు అనే జర్నలిస్టు చేసిన అసభ్యకర వ్యాఖ్యలకు కొమ్మినేని తాళం వేయడమే దీనికి కారణం. గత కొన్నాళ్ల కిందట సినీరంగానికి చెందిన పోసాని కృష్ణమురళీ గతంలో అతను చేసిన అసభ్య వ్యాఖ్యలకు జైలు పాలై వివిధ జైళ్ల చుట్టూ తిరిగి చివరకు బైయిల్ పొంది బతుకుజీవుడా అంటూ..హైదరాబాద్‌లో కాలక్షేపం చేస్తున్నారు. ఇక జగన్‌తో సాన్నిహిత్యం నెరిపిన ఐఏఎస్ అధికారులు, పోలీసులు, అధికారులు చాలా మంది జైళ్ల చుట్టూ తిరుగుతున్నారు. వీళ్లూ వాళ్లని లేదు..జగన్‌తో సంబంధాలు ఉన్న ప్రతిఒక్కరూ ఏదో రకంగా ఆయన వలే జైళ్లకు వెళ్లాల్సి వస్తుంది. తాజాగా సింగర్ మంగ్లీ..కూడా జైలుకు వెళ్లాల్సి వస్తోంది. గతంలో ఆమె జగన్‌కు అనుకూలంగా ప్రచారం చేశారు. జగన్ పార్టీకి పాటలు పాడారు..జగన్‌కు ఓటేస్తేనే ఆంధ్రా భవిష్యత్తు బాగుంటుందని పదే పదే చెప్పారు. ఇటువంటి ఈమె ఇప్పుడు తన జన్మదినంగా ఇచ్చిన ఓ మందు పార్టీలో గంజాయి, మద్యం, మత్తుపదార్ధాలు సేవించారని కేసు నమోదు అయింది. సింగర్ మంగ్లీ జన్మదినోత్సవం సదంర్భంగా దాదాపు 40 మంది ఆ పార్టీకి హాజరై డ్రగ్స్, గంజాయి, విదేశీ మద్యం సేవించారని పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో 8 మంది పాజిటివ్‌గా తేలారని తెలుస్తోంది. వైకాపాతో మంగ్లీది విడదీయరాని అనుబంధం. ఆ పార్టీకి ఎన్నికల సమయంలో ప్రచారం చేయడమే కాదు..టిడిపికి పాటలు పాడాలని టిడిపికి చెందిన వారు కోరగా..ఆమె తిరస్కరించింది. తాను జగన్ పాటలు తప్ప వేరే పాటలు పాడనని టిడిపి నిర్వాహకులకు తేల్చిచెప్పింది. ఈ విషయంపై ఇటీవల టిడిపిలోనూ చర్చసాగింది. కేంద్ర మంత్రి రాంమ్మోహన్‌నాయడు ఆమెకు అరసవల్లి సూర్యనారాయణస్వామి దేవస్థానంలో రథపప్తమి సందర్భంగా ఆమెకు ప్రొటోకాల్ దర్శనం చేయించారు. దీనిపై అప్పట్లో టిడిపి కార్యకర్తలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మొత్తం మీద..జగన్ శిష్యులందరూ..ఆయనను మించినవాళ్లేని తాజా ఘటనతో మరోసారి రుజువయింది.